శంషాబాద్ రూరల్, మే 22 : సాంఘిక సంక్షేమ శాఖలోని 12 గురుకుల ఇంటర్మీయట్ కళాశాలల ఎత్తివేత నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కేవై ప్రణయ్ డిమాండ్ చేశారు. గురువారం శంషాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో సాంఘికసంక్షేమ శాఖ పరిధిలో కొనసాగుతున్న 12 గురకుల ఇంటర్మీడియట్ కళాశాలలో కేవలం పేదవర్గాలకు చెందిన విద్యార్థులు చదువుతున్నారు. వారికి ఇంటర్మీడియట్ విద్యను దూరం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పేదలకు ఆన్యాయం జరుగుతుందన్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాయాలనే లక్ష్యంతో ఇలాంటి కార్యక్రమాలకు పూను కుంటుందని విమర్శించారు. పేద విద్యార్థులకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలంలోనే ప్రజలను పూర్తిగా మోసం చేసిందని విమర్శించారు. పేద విద్యార్థులకు విద్యను దూరం చేయాలనే ఆలోచన పూర్తిగా విరమంచుకోవాలని లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు అనిల్, తరుణ్‌లతో పాటు పలువురు పాల్గొన్నారు.