వికారాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): జిల్లాలోని పలు చెరువులు, ప్రాజెక్టులు కబ్జాకు గురయ్యాయి. వికారాబాద్, పరిగి, తాండూరు నియోజకవర్గాల్లోని పలు చెరువులను కొందరు ఆక్రమించుకున్నారు. అయితే గత కేసీఆర్ ప్రభుత్వం చెరువులను అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పం తో మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని చేపట్టి చెరువులను అభివృద్ధి చేస్తే, వాటికి హద్దులను గుర్తించాల్సిన రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో దానిని ఆసరాగా చేసుకుని ఆక్రమణదారులు పలు చెరువులను చెరబట్టి అక్రమం గా నిర్మాణాలను చేపట్టారు.
అయితే వ్యవసాయానికి నీరందించాల్సిన చెరువులు అక్రమార్కుల వ్యాపారానికి అడ్డాగా మారాయి. గత కొన్నేండ్లుగా చెరువుల ఆక్రమణలు జరుగుతున్నా రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీ శాఖల అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అంతేకాకుండా చెరువులను ఆక్రమించిన ప్రాంతా ల్లో రిసార్ట్లతోపాటు ఫామ్‌హౌస్‌లు, ఇండ ్లనిర్మాణాలకు పంచాయతీ, ఆయా మున్సిపాలిటీల అధికారులు అనుమతులు ఇస్తుండడం సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోని చెరువులు, ప్రాజెక్టుల్లో అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
జిల్లా కేంద్రం సమీపంలోని సర్పన్‌పల్లి ప్రాజెక్టును ఆనుకొని ఉన్న అసైన్డ్ భూము ల్లో అనుమతుల్లేకుండా ప్రైవేట్ రిసార్ట్లు వెలిశాయి. వాటిని చెరువును ఆక్రమించి నిర్మించారు. సర్పన్‌పల్లి ప్రాజెక్టు సమీపంలో ఏర్పాటైన వైల్డర్నెస్ రిసార్ట్‌ను అసైన్డ్ భూమిలో అక్రమంగా నిర్మించడంతోపాటు ఎలాంటి అనుమతుల్లేకుండా బోటిం గ్, ప్రత్యేక రూంలను ఏర్పాటు చేసి పర్యాటకుల నుంచి అక్రమంగా దోచుకుంటున్నారు.
కాగా, వారం రోజుల కిందట సర్పన్‌పల్లి ప్రాజెక్టులో బోటు బోల్తా పడి ఇద్దరు మహిళలు మృతి చెందిన ఘటన తర్వాత జిల్లా ఉన్నతాధికారులు అనుమతుల్లేని వైల్డర్నెస్ రిసార్ట్‌పై చర్యలు చేపట్టారు. ఇప్పటికే జిల్లా పంచాయతీ అధికారుల ద్వారా నోటీసులు అందజేయడంతోపాటు రెవెన్యూ, ఇరిగేషన్, పం చాయతీ తదితర ఏడు శాఖల అధికారులతో కమిటీని ఏర్పాటు చేశారు.
బోటింగ్, రిసార్ట్ నిర్వహించే భూమి తదితర పూర్తి వివరాలతో సమగ్ర నివేదికను అందించాలని కమిటీ సభ్యులను కలెక్టర్ ఆదేశించారు. బోటు బోల్తా పడి ఇద్దరు మహిళలు మృతి చెందిన ఘటనలో వైల్డర్నెస్ రిసార్ట్ నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమంటూ కేసు నమోదు చేసిన వికారాబాద్ టౌన్ పోలీసులు విచారణను ఇంకా వేగవంతం చేయలేదనే విమర్శలు వస్తున్నాయి. అదేవిధంగా వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని శివసాగర్, కొంపల్లి చెరువులు కూడా కబ్జాకు గురయ్యాయి.
ప్రధానంగా మిషన్ భగీరథకు ముందు వికారాబాద్ మున్సిపాలిటీకి తాగు నీరందించే శివసాగర్ చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు ఆక్రమణకు గురయ్యాయి. శివసాగర్ ఎఫ్టీఎల్ పరిధిలోనే పట్టా భూమి అంటూ ఓ ఫామ్‌హౌస్‌ను నిర్మించినా ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. శివసాగర్ బఫర్ జోన్‌లోనూ అక్రమంగా కొన్ని లే అవుట్లు వెలిశాయి. బఫర్ జోన్ అని ఆలోచించకుండా వికారాబాద్ మున్సిపల్ అధికారులు లే అవుట్‌కు అనుమతులివ్వడం గమనార్హం. శివసాగర్ చెరువు ఫీడర్ చానల్స్‌ను కూడా పూడూ రు మండలం నుంచి వికారాబాద్ మున్సిపాలిటీ వరకు కబ్జాదారులు మింగేశారు.