హైదరాబాద్ : ఫార్మా భూముల విషయంలో బీఆర్ఎస్ నాయకులను ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ముందస్తు అరెస్ట్లు చేయిస్తున్నారు. కాగా, ఫార్మా భూములపై బహిరంగ చర్చకు రావాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నక్కర్త మేడిపల్లి గ్రామంలో సభ నిర్వహించడానికి ఏర్పాటు చేసిన టెంట్లు, కుర్చీలను తొలగించిన కాంగ్రెస్ నాయకులు తొలగించారు.
బీఆర్ఏస్ నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ నాయకులు అధికార దుర్వినియోగం చేస్తున్నారని, ఎన్ని అడ్డంకులు సృష్టించినా మేడిపల్లిలో సభ నిర్వహించి తీరుతామని తెలిపిన మంచిరెడ్డి కిషన్ రెడ్డి తెలిపారు.
ఇబ్రహీంపట్నంలో బీఆర్ఏస్ నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు
ఫార్మా భూములపై బహిరంగ చర్చకు రావాలని మల్రెడ్డి రంగారెడ్డికి సవాల్ విసిరిన మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి
ఈ క్రమంలో బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేయిస్తున్న ఇబ్రహీంపట్నం కాంగ్రెస్… https://t.co/kFT7qSbjbe pic.twitter.com/mFr30QK0l4
— Telugu Scribe (@TeluguScribe) April 17, 2026