Ibrahimpatnam | ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 15 : ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని రోటరీ క్లబ్ హైదరాబాద్ నార్త్ ఫౌండేషన్ సభ్యులు వెంకట మురళి అన్నారు. ఇబ్రహీంపట్నం మండలం ముకునూరు గ్రామంలో మంగళవారం ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని కోరుతూ.. మహిళలకు ప్లాస్టిక్ రహిత సంచులను అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని కోరారు. ప్లాస్టిక్ వాడకం పట్ల జరిగే అనర్థాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని సూచించారు. ప్లాస్టిక్ సంచులను పూర్తిగా నిషేధించాలని, ప్రతి ఇళ్లు ప్లాస్టిక్ రహిత ఇళ్లుగా తీర్చిదిద్దే బాధ్యత మహిళలపై ఉందన్నారు. అనంతరం గ్రామంలో నీటి సమస్య తలెత్తిందని, నీటి సమస్య పరిష్కారం కోసం కృషిచేయాలని కోరటంతో గ్రామానికి ఫౌండేషన్ తరుపున రూ.1 లక్ష అందజేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ మండల నాయకుడు సన్నాయి ప్రేమ్‌కుమార్, నాయకులు జంగయ్య, మహేందర్, సతీష్, రాజు, మహేందర్ తదితరులున్నారు.