న్యూఢిల్లీ: అస్సాంలోని దిబ్రుఘర్‌లో నిర్మించిన ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీని ప్రధాని మోదీ(PM Modi) ప్రారంభించారు. అయితే ఆయన ఇవాళ సైనిక దళాలకు చెందిన సీ-130జే విమానంలో ప్రయాణించారు. ఆ భారీ విమానంలో వెళ్లిన ఆయన ఈఎల్ఎఫ్పై ల్యాండ్ అయ్యారు. దిబ్రుఘర్‌లోని మోరాన్ బైసాస్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీని నిర్మించారు. ఈశాన్య భారతంలో ఈఎల్ఎఫ్ను నిర్మించడం ఇదే మొదటిసారి. అక్కడ జరిగిన వైమానిక దళ విన్యాసాలను ప్రధాని మోదీ వీక్షించారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్‌తో పాటు రెస్క్యూ , రిలీఫ్ ఆపరేషన్స్‌కు ఈఎల్ఎఫ్ కీలకం అవుతుందని ప్రధాని మోదీ తన ఎక్స్ పోస్టులో వెల్లడించారు. ఈఎల్ఎఫ్ వద్ద సుమారు 40 నిమిషాల పాటు సైనిక విన్యాసాలను ఏర్పాటు చేశారు. వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలు, ట్రాన్స్‌పోర్టు విమానాలు, హెలికాప్టర్లు ఆ ప్రదర్శనలో పాల్గొన్నాయి.
#WATCH | Assam witnesses a historic moment as Prime Minister Narendra Modi lands at the Emergency Landing Facility (ELF) on Moran Bypass in Dibrugarh. Here, he will witness the aerial display of fighters, transports and helicopters. The ELF is the first of its kind in Northeast… pic.twitter.com/DOp6lNqAXP
— ANI (@ANI) February 14, 2026
సైనిక విన్యాసాల్లో భాగంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ నుంచి భారతీయ వైమానిక దళానికి చెందిన సుఖోయ్-30ఎంకేఐ, రఫేల్ యుద్ధ విమానాలు ఎగిరాయి. ఈ కార్యక్రమంలో ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ కూడా పాల్గొన్నారు.
#WATCH | Assam: Indian Air Force’s Rafale took off from the Emergency Landing Facility (ELF) on Moran Bypass in Dibrugarh. PM Narendra Modi and others watched the take off.
Video: DD) pic.twitter.com/aYCApjlgJC
— ANI (@ANI) February 14, 2026