Malavika Mohanan | రాజాసాబ్ ‘డూప్’ వివాదం.. ట్రోలర్లకు మాళవిక మోహనన్ అదిరిపోయే కౌంటర్!
TheRajaSaab | ప్రభాస్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో రూపొందిన 'ది రాజాసాబ్' చిత్రంపై వస్తున్న ట్రోల్స్‌కు హీరోయిన్ మాళవిక మోహనన్ గట్టి కౌంటర్ ఇచ్చారు.
Malavika Mohanan | ప్రభాస్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో రూపొందిన ‘ది రాజాసాబ్’ చిత్రంపై వస్తున్న ట్రోల్స్‌కు హీరోయిన్ మాళవిక మోహనన్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ సినిమాలో తను చేసిన యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం డూప్ వాడారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఆమె స్వయంగా క్లారిటీ ఇచ్చారు. సినిమా ఓటీటీలోకి వచ్చిన తర్వాత, విలన్ గ్యాంగ్‌లో నటించిన రోన్సన్ విన్సెంట్ ఒక ఫోటోను షేర్ చేయగా.. అందులో మాళవిక వేసుకున్న దుస్తుల్లోనే ఒక పురుష స్టంట్ మాన్ ఉండటంతో, ఆమె అసలు ఫైట్స్ చేయలేదంటూ నెటిజన్లు విమర్శలు మొదలుపెట్టారు.
దీంతో ఈ వార్తలపై స్పందించిన మాళవిక, తాను స్వయంగా రోప్ సాయంతో స్టంట్స్ చేస్తున్న బిహైండ్ ది సీన్స్ వీడియోలను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. తనకు చిన్నప్పటి నుంచి క్రీడలంటే ఇష్టమని తెలిపిన మాళవిక, శారీరక సవాలుతో కూడిన పనులు చేయడం అలవాటు కాబట్టి తన యాక్షన్ సీన్లను తనే స్వయంగా చేశానని ఆమె స్పష్టం చేసింది. సాధారణంగా సినిమాల్లో అత్యంత ప్రమాదకరమైన షాట్స్ చేసేటప్పుడు నటీనటులకు దెబ్బలు తగలకుండా ఉండేందుకు ప్రొఫెషనల్ స్టంట్ డబుల్స్ ఉండటం సినిమా రంగంలో కామన్ అని ఆమె వివరించారు. ఈ సందర్భంగా తనకు స్టంట్స్ నేర్పించిన సదరు స్టంట్ మాన్కు కృతజ్ఞతలు తెలుపుతూ, అనవసరపు విమర్శలకు ఆమె తెరదించారు.
Been seeing a lot of tweets and articles about how I claimed to do my own stunts for ‘The Rajasaab’ but a body double did it as there’s a photo circulating online of a stunt artist who was my stunt double on the film.
Firstly, I do action because I really enjoy doing action.… pic.twitter.com/9ePwlLpti4
— Malavika Mohanan (@MalavikaM_) February 13, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

