ఆకుపచ్చని వైభవం తెచ్చేలా..
రాష్ర్టానికి ఆకుపచ్చని వైభవం తీసు కొచ్చేందుకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమం కోసం నర్సరీల్లో మొక్కల పెంపకం జోరుగా సాగుతున్నది.
- రానున్న హరితహారానికి సిద్ధమవుతున్న మొక్కలు
- కుంట్లూర్ సెంట్రల్ నర్సరీలో రెండు లక్షల మొక్కల పెంపకం
- మున్సిపాలిటీలో అదనంగా మరో 25 వేలు..
పెద్దఅంబర్పేట, డిసెంబర్ 15: రాష్ర్టానికి ఆకుపచ్చని వైభవం తీసు కొచ్చేందుకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమం కోసం నర్సరీల్లో మొక్కల పెంపకం జోరుగా సాగుతున్నది. వివిధ రకాల పండ్లు, పూల మొక్కలతోపాటు ఔషధ మొక్కలను కూడా పెద్దఎత్తున పెంచుతున్నారు. వచ్చే ఏడాది జరుగనున్న కార్యక్రమంకోసం అటవీశాఖ శంషాబాద్ డివిజన్ హయత్నగర్ రేంజ్ కుంట్లూర్ సెంట్రల్ నర్సరీలో 2 లక్షల మొక్క లను పెంచుతున్నారు. మున్సిపాలిటీ కోసం ప్రత్యేకంగా దాదాపు 25 రకాల మరో 25 వేల మొక్కలను సిద్ధం చేస్తున్నారు.
విత్తనాన్ని బట్టి ..
కుంట్లూరు అటవీ నర్సరీలో విత్తనాలతో ముందుగా ప్రైమరీ బెడ్ వేస్తారు. విత్తనాన్ని బట్టి 10 నుంచి 45 రోజుల వ్యవధిలో మొలకలు వస్తాయి. నారు నాణ్యతను చూసి వాటిని మట్టితో నింపిన చిన్న, చిన్న కవర్లలో వేస్తారు. మొక్కలు కొంచెం పెద్దవి కాగానే వాటిని వేరే కవర్లలోకి మారుస్తారు. ఇలా విత్తనం మొలకెత్తింది మొదలు.. మొక్క పెరిగేవరకు అన్నింటినీ దగ్గరుండి పర్యవేక్షిస్తారు. శంషాబాద్ అటవీ రేంజ్ పరిధిలోని వివిధ ప్రాంతాలకు ఇక్కడి నుంచే మొక్కలను సరఫరా చేస్తున్నారు. కొన్ని మొక్కలను నాటేందుకు అనుగుణంగా పెద్దవిగానూ తయారు చేస్తున్నారు.
గత ఆగస్టు నెల నుంచే వీటి పెంపకాన్ని ప్రారంభించారు.
ఎన్నో రకాలుకుంట్లూరు సెంట్రల్ నర్సరీలో 25 రకాల వివిధ మొక్కలున్నాయి. మహాగని, మర్రి, రోజ్వుడ్, రావి, నారేపి, కరక, సోమిడి, బాదం, ఉసిరి, వేప, జమ్మి, కానుగ, రేగి, వేరుమద్ది, నేరేడు, ఊడుగ, చింత, ఫ్రైడ్ ఆఫ్ ఇండియా, ఆకాశమల్లి, విప్పి, కర్జూర, చైనా బాదం, మారేడు, వెలగ తదితర మొక్కలను వేల సంఖ్యలో పెం చుతున్నారు. వీటిలో సువాసన వెదజల్లే పూల మొక్కలు కూడా ఉన్నాయి. ఔషధ గుణాలు కలిగిన మొక్కలూ ఉన్నాయని బీట్ ఆఫీసర్ కృష్ణవేణి తెలిపారు. కరక, సోమిడి, వేరుమద్ది, ఉసిరి, వెలగ, నల్లజీడి తదితర మొక్కలను ఆయుర్వేద, ఇతర ఔషధాల తయారీలో వినియోగిస్తారని వెల్లడించారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

