తాండూరు/బషీరాబాద్ : వరంగల్‌లో జరుగనున్న రజతోత్సవ మహాసభకు జాతరలా తరలివచ్చి సక్సెస్ చేద్దామని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి కార్యకర్తలు, అభిమానులకు పిలుపునిచ్చారు. సోమవారం ఆయన తాండూరులోని ఆయన నివాసంలో తాండూరు పట్టణ బీఆర్ఎస్ నేతలతో మీటిం గ్ నిర్వహించడంతోపాటు బషీరాబాద్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాల ఆవరణలో మండల పార్టీ అధ్యక్షుడు నర్సిరెడ్డి ఆధ్వర్యంలో మండల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ.. త్వరలో రానున్నది మ న ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. 16 నెలల కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. ము ఖ్యంగా రైతులు మళ్లీ కేసీఆరే సీఎం కావాలని కోరుటుంటున్నారని తెలిపారు.
బీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేసే వారికే మొ దటి ప్రాధాన్యత ఉంటుందన్నారు. కేసీఆర్ అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ప్రజలు రజతోత్సవ సభకు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని.. వారిని ముందుం డి తీసుకెళ్లే బాధ్యత కార్యకర్తలదేనన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ తాండూరు పట్టణాధ్యక్షుడు నయీం, బీఆర్ఎస్ నేతలు నర్సింహులు, శ్రీనివాస్‌చారి, సలీం, అనిల్, యూనుస్, రవీందర్‌సింగ్ తన్వర్, అబ్దుల్ రజాక్, అనంతయ్య, పాండురంగారెడ్డి, వెంకట్‌రెడ్డి, చందర్, దస్తయ్యగౌడ్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.