రంగారెడ్డి, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ) : భూసేకరణ పేరుతో ఫార్మా భూముల చుట్టూ వేస్తున్న ఫెన్సింగ్‌తో బంధంచెరువు బందీగా మారనున్నది. ఫార్మాకోసం సేకరించిన భూముల్లోని అటవీ ప్రాంతంలో బంధం చెరువు ఉన్నది. అడవి జంతువులతో పాటు బర్రెలు, గొర్రెలు ఈ చెరువులోని నీటిని తాగుతాయి. అధికారులు చేపట్టిన కంచె ఏర్పాటు పనులతో ఈ చెరువులోకి దప్పిక తీర్చుకునేందుకు మూగజీవాలు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.
యాచారం మండలంలోని తాటిపర్తి గ్రామంలో బంధంచెరువు సుమారు 24 ఎకరాల్లో విస్తీర్ణం ఉన్నది. అడవి జంతువులకు ఈ చెరువే కొన్నేండ్లుగా దప్పిక తీర్చుతున్నది. మూగజీవాల దప్పిక తీర్చుతున్న బంధం చెరువు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు పనులను ఆపా లని.. రైతులు అడ్డుకున్నా పోలీసుల బందోబస్తుతో చేపట్టడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.
మా తాతలు, తండ్రుల కాలం నుంచి ఈ చెరువునే నమ్ముకుని జీవిస్తున్నాం. ఈ చెరువు మూగజీవాల దప్పిక తీర్చుతున్నది. అలాంటి చెరువును చెరబట్టి చుట్టూ ఫెన్సింగ్ వేయడం దారుణం.
-చిట్టి నాగరాజు
అధికారులు గ్రామాల్లో వేస్తున్న ఫెన్సింగ్ చట్ట విరుద్ధం. ఫార్మా భూముల్లో ఎలాంటి పనులు
చేపట్టవద్దని కోర్టు స్టే ఆర్డర్ ఉన్నా పోలీసు బం దోబస్తు మధ్య అధికారులు భూముల్లో కంచె వేస్తున్నారు. మూగజీవాల దాహార్తిని తీర్చే బంధంచెరువు చుట్టూ కంచె ఏర్పా టు సమంజసం కాదు.