వికారాబాద్, జూలై 27 : వికారాబాద్ జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేప థ్యంలో ప్రజలు ప్రాజెక్టులు, చెరువుల వద్దకు వెళ్లొద్దని కలెక్టర్ ప్రతీక్‌జైన్ సూచించారు. ఆదివారం ఆయన సర్పాన్‌పల్లి ప్రాజెక్టును ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రాజెక్టు నీటిమట్టం, కేపాసిటీ తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. చుట్టు పక్క గ్రామాల ప్రజలు ప్రాజెక్టు సమీపంలోకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆయనతోపాటు ఇరిగేషన్ ఈఈలు మధుసూదన్‌రెడ్డి, నరేందర్ ఉన్నారు.
పరీక్షా కేంద్రాల తనిఖీ..
వికారాబాద్ జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన గ్రామ పాలన అధికారి, లైసెన్స్డ్ సర్వేయర్ పరీక్షల కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. అభ్యర్థుల హాజరు వివరాలను అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు గ్రామ పాలనాధికారి పరీక్ష జరుగగా.. 83 మంది అభ్యర్థులకు 66 మంది హాజరయ్యారు. అదేవిధంగా లైసెన్స్డ్ సర్వేయర్ల పరీక్షకు సంబంధించి ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగగా..
139 మంది అభ్యర్థులకు 121 మంది హాజరు కాగా.. 18 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన పరీక్షకు 139 మంది అభ్యర్థులకు 121 మంది హాజరు కాగా 18 మంది గైర్హాజరయ్యారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, ఆర్డీవో వాసుచంద్ర, డీటీడీవో కమలాకర్‌రెడ్డి, మైనార్టీ వెల్ఫేర్ అధికారిణి రాజేశ్వరి, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ నెహమత్ అలీ తదితరులున్నారు.