పూడూరు, సెప్టెంబర్ 25 : అభివృద్ధి పనుల పేరుతో ముస్లిం సోదరులకు చెప్పకుండా, వారికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రోడ్డుకు అడ్డంగా ఉన్నదని దర్గా, శ్మశానవాటికను అధికారులు అర్ధరాత్రి తొలగించడం దారుణమని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పేర్కొన్నారు. బాధితులను పరామర్శించేందుకు గురువారం ఆయన హైదరాబాద్ నుంచి కొడంగల్ వెళ్తుండగా పోలీసులు అరెస్ట్ చేసి చన్గోముల్ ఠాణాకు తీసుకెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి కార్యకర్తలతో ఠాణాకెళ్లి అతడికి సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా నరేందర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడు తూ.. కాంగ్రెస్ ప్రభు త్వం ముస్లింలకు సమాచారం ఇవ్వకుం డా రాత్రివేళ దర్గా, శ్మశాన వాటికను కూల్చడం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొడంగల్ నియోజకవర్గంలో రైతులు, ముస్లింలకు అన్యాయం జరుగుతున్నదన్నారు. ప్రభు త్వం ఎన్ని కేసులు పెట్టినా ప్రజల కోసం పోరాడుతామన్నారు. అనంతరం పరిగి మాజీ ఎమ్మె ల్యే మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభు త్వం అర్ధరాత్రి వేళ దర్గా, శ్మశాన వాటికను తొలగించడం తగదన్నారు. పోలీసులు ప్రతి చిన్న విషయానికీ అరెస్టులు చేస్తున్నారన్నారు. వారితో మాజీ ఎంపీపీ మల్లేశం, పరిగి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అజార్, మైనార్టీ నాయకుడు అదిల్, జావిద్, రహిస్ఖాన్, దయాగౌడ్, నర్సింహులు, పార్టీ నాయకులు ఉన్నారు.
దోమ : సీఎం రేవంత్‌రెడ్డి ఇలాకాలో పోలీసుల నిర్బంధకాండ కొనసాగుతున్నది. అభివృద్ధి పనుల పేరుతో కొడంగల్ పట్టణంలో దర్గా, శ్మశాన వాటిక, పలువురి ఇండ్లు, షాపుల కూల్చివేతతో బాధితులను పరామర్శించేందుకు గురువారం హైదరాబాద్ నుంచి కొడంగల్‌కు వెళ్తున్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి దోమ ఠాణాకు తరలించారు. అతడిని రెండు గంటల పాటు అక్కడే ఉంచారు. ఈ విషయం తెలుసుకున్న పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి దోమ ఠాణాకెళ్లి నరేందర్‌రెడ్డికి సంఘీభావం తెలిపారు. పోలీసుల ముందస్తు అరెస్టును ఖండించారు. పలువురు బీఆర్ఎస్ నాయకులు కూడా నరేందర్‌రెడ్డిని కలిసి సంఘీభావం ప్రకటించారు.
పరిగి : కొడంగల్‌లో అభివృద్ధి పనుల పేరిట అధికారులు కూల్చివేయడంతో బాధితుల ను పరామర్శించేందుకు వెళ్తు న్న కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇంతియాజ్ ఇషాక్, గ్రంథాలయ సంస్థ నారాయణపేట జిల్లా మాజీ చైర్మన్ రామకృష్ణ, బీఆర్ఎస్ నాయకులు అలమయ్యగౌడ్, సాయిలు, మధుసూదన్‌రెడ్డిలను పోలీసులు ముందస్తు గా అరెస్టు చేసి పరిగి ఠాణాకు తరలించారు.
కాగా, ఈ విష యం తెలుసుకున్న మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్‌కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, మాజీ డ్పీ కో-ఆప్షన్ సభ్యుడు మీర్ మహమూద్‌అలీ, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ భాస్కర్, బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్, రవికుమార్ తదితరులు వెళ్లి వారికి సంఘీభావం తెలిపారు. దీంతో వారిని పోలీసులు చన్గోముల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.