వికారాబాద్, ఆగస్టు 25 : పదేండ్లలో రాని యూరియా కొరత ఇప్పుడెందుకు వచ్చిందని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సోమవారం ఆయన మోమిన్‌పేట మండల కేం ద్రంలోని పీఏసీఎస్ కార్యాలయం ఎదుట యూరియా కోసం క్యూలో నిలబడి ఇబ్బంది పడుతున్న రైతులను.. బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ నియోజకవర్గ నాయకులతో కలిసి పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి.. రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరతను ప్రభుత్వం త్వరగా పరిష్కరించేలా చూడాలని వినతిపత్రం ఇచ్చి నిరసన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో ప్రతి సీజన్లోనూ అధికారులతో సమీక్షలు చేస్తూ విత్తనాలు, ఎరువులు, కరెంట్, ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు.
పదేండ్ల పాలనలో ఎప్పుడూ లేని యూరియా కొరత ఇప్పుడు ఎం దుకు వచ్చిందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతులు పొలం పనులను పక్కనపెట్టి యూరియా కోసం రోడ్డు ఎక్కాల్సిన దుస్థితి వచ్చిందని మండిపడ్డారు. యూరియా లేక రైతు లు ఇబ్బందులు పడుతుంటే, యూరియా కొర త లేదని అధికారులు తప్పుడు ప్రకటనలు చేస్తూ రైతులను గందరగోళానికి గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
యూరియా కొరతే లేకుంటే పీఏసీఎస్‌ల వద్ద చెప్పుల లైన్లు ఎం దుకు ఉంటున్నాయని ఆయన అధికారులను ప్రశ్నించారు. ప్రభుత్వం అన్నదాతల అవ స్థల ను దృష్టిలో ఉంచుకుని వెంటనే సరిపడా యూ రియాను అందించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్, నాయకులు తదితరులు ఉన్నారు.