Gattu Ippalapalle | కడ్తాల్, జూన్ 23 : గట్టుఇప్పలపల్లి గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించే వరకు పోరాటం ఆగదని మండల సాధన సమితి నాయకులు అన్నారు. గట్టుఇప్పలపల్లి గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ.. గ్రామంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. అన్ని అర్హతలున్న గట్టుఇప్పలపల్లి గ్రామాన్ని ప్రభుత్వం వెంటనే మండల కేంద్రంగా ప్రకటించాలని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో గట్టుఇప్పలపల్లి గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ నాయకులు, ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
మండల కేంద్రం ఏర్పాటుకు కాంగ్రెస్ నాయకులు చొరవ తీసుకోవాలని, లేని పక్షంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల సాధన సమితి నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Alumni | ఎన్నాళ్లకెన్నాళ్లకు.. పాతికేళ్ల తర్వాత పూర్వ విద్యార్థులంతా కలిశారు
Rayaparthi | వ్యవసాయ భూములకు వెళ్లే బాట కబ్జా.. కలెక్టరేట్ ఎదుట రైతుల నిరసన
Suryapet | కేసుల పరిష్కారంలో న్యాయవాదుల సహకారం అవసరం : జూనియర్ సివిల్ జడ్జి ఆయేషా సరీన