తెలంగాణలో ప్రతిపక్షపార్టీలకు స్థానంలేదు : ఎమ్మెల్యే మంచిరెడ్డి
MLA Manchireddy |తెలంగాణలో ప్రతిపక్షపార్టీల ఉనికి ప్రశ్నార్థకంగా మారిందని, దీనిని తట్టుకోలేక టీఆర్ఎస్పై బురదజల్లే రాజకీయాలు చేస్తున్నారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు.
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 21 : తెలంగాణలో ప్రతిపక్షపార్టీల ఉనికి ప్రశ్నార్థకంగా మారిందని, దీనిని తట్టుకోలేక టీఆర్ఎస్పై బురదజల్లే రాజకీయాలు చేస్తున్నారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు.
బుధవారం తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని కమ్మగూడ గ్రామానికి చెందిన సుమారు 250 మంది వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో పెద్ద ఎత్తున అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని, దీనిని జీర్ణించుకోలేక టీఆర్ఎస్పై బురదజల్లే రాజకీయాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.
రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్, బీజేపీల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున టీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ మరోసారి ఘనవిజయం సాధిచంటం ఖాయమని ఆయన తెలిపారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

