కాంగ్రెస్‌వి డూప్లికేట్ గ్యారంటీలు
ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలన్నీ డూప్లికేట్ అని, ఎన్నికల తర్వాత హామీలేవి కాంగ్రెస్ నేతలకు గుర్తుండవని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి విమర్శించారు.
- పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి
పరిగి, నవంబర్ 10 : ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలన్నీ డూప్లికేట్ అని, ఎన్నికల తర్వాత హామీలేవి కాంగ్రెస్ నేతలకు గుర్తుండవని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి విమర్శించారు. దేశంలో వివిధ రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ తెలంగాణలో అమలు చేస్తామన్న గ్యారంటీలేవి అక్కడ అమలు చేయకపోవడమే కాంగ్రెస్ మోసపూరిత వైఖరికి నిదర్శనమన్నారు. శుక్రవారం పరిగి మండలం యాబాజిగూడ, తొండపల్లి, చిట్యాల్, సయ్యద్‌పల్లి, రావులపల్లి, రాపోల్ తదితర గ్రామాల్లో ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో హామీలివ్వడం, తర్వాత వాటిని తుంగలో తొక్కడం కాంగ్రెస్‌కు అలవాటని విమర్శించారు.
పక్కనే గల కర్ణాటకలో ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలేవి పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదని ఆయన గుర్తు చేశారు. ఈ విషయాలను ప్రజలు గమనించాలని ఆయన సూచించారు. ఎన్నికల హామీలన్నింటినీ నెరవేర్చిన నాయకుడు సీఎం కేసీఆర్ అని తెలిపారు. ఎన్నికలప్పుడు చెప్పని అనేక కార్యక్రమాలు అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు.

రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్, మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా వంటివి సమ ర్థవంతంగా అమలు చేయడం ద్వారా సీఎం కేసీఆర్ ప్రజల హృదయాలలో నిలిచిపో యారని తెలిపారు. ఈసారి సైతం ఎన్నికలలో సీఎం కేసీఆర్‌ను గెలిపించాలని ప్రజలు నిర్ణయించారని ఆయన పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రేషన్‌కార్డుపై సన్నబియ్యం సరఫరా, ప్రతి కుటుంబానికి రూ.5లక్షలు బీమా సదుపాయం, రూ.15లక్షల వరకు వైద్యం చేయించుకునేందుకు అవకాశం కల్పించడం, ఆసరా పింఛన్లు రూ.5వేల వరకు పెంపు, రైతుబంధు సాయం రూ.16వేల వరకు పెంపు వంటివి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కరణం అరవిందరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్, పీఏసీఎస్ చైర్మన్ కొప్పుల శ్యాం సుందర్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మేడిద రాజేందర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆంజనేయులు, సీనియర్ నాయకులు కొప్పుల అనిల్‌రెడ్డి, ప్రవీణ్ కుమార్‌రెడ్డి, సర్పంచ్‌లు అశోక్‌వర్దన్‌రెడ్డి, కె.వెంకటరామకృష్ణారెడ్డి, జంగయ్య, ప్రవీణ్, నల్క జగన్, రాములు, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ వెంకటయ్య, పీఏసీఎస్ వైస్ చైర్మన్ భాస్కర్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

