రంగారెడ్డి, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో తెరపైకి రోజుకో కొత్త ప్రతిపాదన వస్తున్నది. కందుకూరు మండలంలోని పంజాగూడలో ఫ్యూచర్‌సిటీ కేంద్రంగా కొత్తగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సర్కార్‌కు అధికారులు ప్రతిపాదనలు పం పారు. ఇప్పటికే జిల్లాలోని పది మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాద్‌లో కలపాలన్న ప్రతిపాదన కూడా తెరపైకి వచ్చింది. కొత్తగా మహేశ్వరం, కందుకూరులను మున్సిపాలిటీలుగా చేయాలన్న ప్రతిపాదనలున్నా వాటిని పక్కన పెట్టి ఫ్యూచర్‌సిటీ కేంద్రంగా ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, కడ్తాల్, కందుకూరు, మహేశ్వరం, యాచారం, మం చాల మండలాల్లోని పలు గ్రామాలను కలుపుతూ ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదనలు రూపొందించి.. ఆ నివేదికను ప్రభుత్వానికి పం పించగా.. తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది. ఫ్యూచర్‌సిటీ నిర్మాణంపై ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఔటర్ రింగ్ రోడ్డు లోపలి నుంచి ప్రతిపాదిత రీజినల్ రింగ్‌రోడ్డు(ట్రిఫుల్‌ఆర్)ను కలుపుతూ అతిపెద్ద కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది.
ఫ్యూ చర్సిటీకి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తేనే అభివృద్ధి పరంగా ఎలాంటి అడ్డంకులు ఉండవని భావిస్తున్నట్లు సమాచారం. ప్యూచర్‌సిటీ కోసం ఇప్పటికే గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు ఏర్పాటుకు సర్వే చేపట్టగా అది పూర్తైంది. అలాగే, శంషాబా ద్ నుంచి ఫ్యూచర్‌సిటీ వరకు మెట్రోలైన్ ఏర్పాటు ప్రతిపాదనలూ వడివడిగా సాగుతున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని ఫ్యూచర్‌సిటీని ప్రత్యేక కార్పొరేషన్ చేస్తేనే బాగుంటుందన్న నిర్ణయానికి అధికారులొచ్చారు.
ఫ్యూచర్‌సిటీలో విలీనం చేయొద్దు
కందుకూరు మండలంలోని పంజాగూడ కేంద్రంగా ఫ్యూచర్‌సిటీ ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనపై పలు గ్రామాల ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మంచాల, ఇబ్రహీంపట్నం మండలాల్లోని పలు గ్రామాలను ఫ్యూచర్‌సిటీలో విలీనం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమ గ్రామాలు పంచాయతీలుగా ఉన్నాయని, వాటిని తీసుకెళ్లి ఎక్కడో కందుకూరు మండలంలో ఏర్పాటయ్యే ఫ్యూచర్‌సిటీలో కలిపితే తమకు ఇబ్బందులు తలెత్తుతాయని ప్రజలు మండిపడుతున్నారు. ఆ ప్రతిపాదనను విరమించుకోవాలని కోరుతున్నారు.
ఫ్యూచర్‌సిటీ కార్పొరేషన్ పరిధిలోకి వచ్చే గ్రామాలు..
జిల్లాలోని ఏడు మండలాలను కలుపుతూ ఫ్యూచర్ సిటీ ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదించారు. ఇందులో కందుకూరు మండలంలోని దాసర్లపల్లి, అన్నోజిగూడ, గూడూరు, దెబ్బడగూడ, గుమ్మడవెల్లి, కందుకూ రు, కొత్తూరు, గఫూర్నగర్, లేమూర్, మాదాపూర్, మీర్ఖాన్పేట్, అహ్మద్‌నగర్, ముచ్చర్ల, పంజాగూడ, రాచులూరు, సార్లరావులపల్లి, తిమ్మాయపల్లి, తిమ్మాపూర్.
యాచారం మండలంలోని.. చౌదర్పల్లి, గున్గల్, కొత్తపల్లి, కుర్మిద్ద, మేడిపల్లి, మల్కీజ్‌గూడ, మొగుళ్లవంపు, నక్కర్త, నానక్‌నగర్, నందివనపర్తి, నజ్దిక్‌సింగారం, తక్కళ్లపల్లి, తాటిపర్తి, తులేఖుర్దు, యాచారం, చింతపట్ల, నల్లవెల్లి,
మహేశ్వరం మండలంలోని.. మహ్బత్నగర్, తుమ్మలూరు,
మంచాల మండలంలోని.. నోముల, ఆగాపల్లి, మల్లిఖార్జునగూడ,
కడ్తాల్ మండలంలోని.. చరికొండ, వట్టికల్వకుర్తి, పట్టిపడకల్, ఎక్రాజ్గూడ, కడ్తాల్, కర్కల్‌పహాడ్, ముద్వేన్,
ఆమనగల్లు మండలంలోని.. రానుంతల, కొనాపూ ర్ వచ్చేలా నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి పంపించినట్లు జిల్లా పంచాయతీ అధికారులు తెలిపారు.
ఇప్పటికే గ్రేటర్లోకి మున్సిపాలిటీల విలీన ప్రతిపాదన..
జిల్లాలోని హైదరాబాద్ శివారులోని పది మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాద్‌లో కలపాలన్న ప్రతిపాదన కూడా ఇప్పటికే సిద్ధమైంది. శివారుల్లోని ఔటర్‌రింగ్‌రోడ్డు లోపలి ఆదిబట్ల, తుర్కయాంజాల్, పెద్దఅంబర్‌పేట, తుక్కుగూడ, శంషాబాద్, రాజేంద్రనగర్, మణికొండ, నార్సింగి, శంకర్పల్లి, బండ్లగూడ, ఇబ్రహీంపట్నంతోపాటు మీర్‌పేట, బడంగ్‌పేట నగరపాలక సంస్థలనూ గ్రేటర్ హైదరాబాద్‌లో కలపాలన్న ప్రతిపాదన కూడా ఇప్పటికే తెరపైకి వచ్చింది.