సైన్స్‌తోనే మానవ మనుగడ
జాతీయ వైజ్ఞానిక దినోత్సవాన్ని పురస్కరించుకొని మున్సిపల్ పరిధి, మండల పరిధిలోని బుధవారం పలు ప్రభుత్వ పాఠశాలల్లో సీవీ రామన్‌కు ఘన నివాళి అర్పిస్తూ.. సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
కొడంగల్, ఫిబ్రవరి 28 : జాతీయ వైజ్ఞానిక దినోత్సవాన్ని పురస్కరించుకొని మున్సిపల్ పరిధి, మండల పరిధిలోని బుధవారం పలు ప్రభుత్వ పాఠశాలల్లో సీవీ రామన్‌కు ఘన నివాళి అర్పిస్తూ.. సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలతో పాటు బాలిక ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సైన్స్ ఫెయిర్ కార్యక్రమం పలువురిని ఆకట్టుకున్నది. విద్యార్థులు తయారు చేసిన పరికరాలను సందర్శనకు వచ్చినవారికి వివరించారు.
ఈ సందర్భంగా ఎంఈవో రాంరెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచం సైన్స్‌పైనే ఆధారపడి ఉందని, నేడు అంతరిక్షంలోకి అడుగు పెట్టడం వంటి ఎన్నో పురోగతులు సాధించినట్లు పేర్కొన్నారు. విద్యార్థి దశ నుంచే సైన్స్‌పై పట్టు ఏర్పడుతుందన్నారు. కార్యక్రమంలో జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల హెచ్ఎం. మురళీధర్‌తో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
వికారాబాద్: జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా బుధవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని సంకల్ప్ విద్యాపీఠంలో సైన్స్ దినోత్సవాన్ని విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పాఠశాల విద్యార్థులు వారి మేధాశక్తిని ఉపయోగించి వివిధ రకాల ప్రయోగాలను తయారు చేశారు. ఈ ప్రయోగాలను ఇతరులకు చక్క గా వివరించారు. దీంతో పాఠ శాల ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.
పరిగి టౌన్: ఇంటర్నేషనల్ సైన్స్ డేను పురస్కరించుకొని పరిగి పట్టణంలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్‌కుమార్ పాల్గొని విద్యార్థులు చేసిన ప్రాజెక్టులను తిలకించి అభి నందించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఎదిరె కృష్ణ, మునీర్, మీర్ తాహెర్‌అలీ, మౌలానా, రవికుమార్, ఆకారపు రాజు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
కులకచర్ల: కులకచర్ల, చౌడాపూర్ మండలాల పరిధిలోని వివిధ పాఠశాలల్లో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని బుధవారం విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు. చౌడాపూర్ మండల పరిధిలోని మరికల్ ఉన్నత పాఠశాలలో 20 జీవశాస్త్ర ప్రయోగాలు, 20 భౌతిక శాస్త్ర ప్రయోగాలు చేసి ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

