పెద్దేముల్, ఏప్రిల్ 19 : ఉపాధి హామీ పనులు చేస్తూ గుండెపోటుతో కూలీ మృతి చెందిన ఘటన మండలంలోని దుర్గాపూర్లో జరిగింది. గ్రామానికి చెందిన వడ్డె పెద్ద అమృతయ్య శనివారం ఉపాధి హామీ పనులు చేస్తుండగా గుండెలో నొప్పి వస్తున్నదని తోటి కూలీలతో చెప్పగా.. అక్కడే ఉన్న అతడి చిన్న భార్య తాండూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లింది.
అక్కడి డాక్టర్లు పరీక్షించి అమృతయ్య మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో దుర్గాపూర్లో విషా దఛాయలు అలుముకున్నాయి. అమృతయ్యకు ఇద్దరు భార్యలు, ఇద్దరు కుమా రులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. అమృతయ్య చనిపోయిన విషయాన్ని తెలుసుకున్న ఉపాధి హామీ టీఏ శ్రావణ్, ఎఫ్ఏ వెంకటయ్యతో కలిసి వచ్చి అమృతయ్య కుటుంబాన్ని పరామర్శించారు.