Dammaiguda | కీసర, మార్చి 13 : దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని పలు వార్డు కార్యాలయ గ్రామాల్లో పనిచేసే మున్సిపల్ కార్మికులకు 3 నెలల నుంచి జీతాలు ఇవ్వకపోవడంతో కార్మికులందరు అందోళనకు దిగారు. దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని కీసర, దమ్మాయిగూడ, చీర్యాల్, యాద్గార్పల్లి తదితర గ్రామాల్లో పనిచేసే మున్సిపల్ కార్మికులకు 3 నెలల పాటు జీతాలు ఇవ్వకపోవడంతో కార్మీకులు రోడ్డు ఎక్కారు. కార్మికులందరు నిరసనకు దిగారు.
వారం రోజుల్లో జీతాలు ఇస్తామని చెప్పి నెలలు గడుస్తున్న జీతాలు ఇవ్వడం లేదని కార్మికులు తీవ్ర ఆవేదనకు దిగారు. తమ కుటుంబ పోషణ తీవ్ర భారం అవుతుందని, ప్రతి నెల జీతాలు క్రమం తప్పకుండా ఇవ్వాలని మున్సిపల్ కార్మికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.