కొడంగల్, జులై 30 : ఎన్నికల సమయంలో కామారెడ్డి సభలో ముదిరాజ్‌లను బీసీడీ నుంచి ఏగ్రూపులో చేరుస్తామని సీఎం హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని ముదిరాజ్ సంఘం సభ్యులు కోరారు. బుధవారం స్థానిక బసిరెడ్డి గార్డన్ హాల్లో ముదిరాజ్ సంఘం ముఖ్య నాయకుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముదిరాజ్‌లు జనాభాకు అనుగుణంగా విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో ప్రభుత్వం అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.
అన్ని రంగతాల్లో వెనుకబాటుకు గురైన ముదిరాజ్‌లను బీసీ ఏలో చేర్చేందుకు రేవంత్‌రెడ్డి చొరవ చూపాలని, ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు. త్వరలోనే సీఎంను కలిసి నివేదిక అందించననున్నట్లు తెలిపారు. వచ్చే నెల ఆగష్టు 20వ తేదీన కొడంగల్‌లో భారీ సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు వేణుగోపాల్, తాలుక అధ్యక్షులు నర్సింహులు, సత్యపాల్, తుడుం శ్రీనివాస్, మెరుగు వెంకటయ్య, బాలయ్య, బురాన్‌పూర్ నారాయణ, కూర వెంకటయ్య, యాదగిరి, బాబయ్య నాయుడు, హనుమంతు, కోట్ల మైపాల్, తిరుపతయ్య, గోపాల్, రాములు, బాల్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.