కొత్తూరు, జూన్ 8: తండా పంచాయతీల్లో అంతర్గత రోడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఎంపీపీ పిన్నింటి మధుసూదన్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని వైఎం తండాల్లో ఎంపీపీ నిధులు రూ.4 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను ఎంపీపీ మధుసూదన్‌రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. తండా పంచాయతీల అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు.
అందుకోసం తండాల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ముందుకు కదులుతున్నామని చెప్పారు. ముఖ్యంగా అంతర్గత రోడ్లను సీసీలుగా మార్చే ప్రక్రియ శరవేగంగా కొనసాగుతున్నన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ డాకీ, మాజీ సర్పంచ్ అరుణ, రవినాయక్, బీఆర్ఎస్ నాయకులు రమేశ్, మాజీ ఉపసర్పంచ్ దశరథ్‌నాయక్ పాల్గొన్నారు.