కేశంపేట, మే 20 : ఇందిరమ్మ పథకం లబ్ధిదారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఇండ్ల నిర్మాణం చేపట్టాలని కేశంపేట ఎంపీవో, ఇన్చార్జి ఎంపీడీవో కిష్టయ్య అన్నారు. మండలంలోని చౌలపల్లి గ్రామంలో మంగళవారం లబ్ధిదారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి పలు సూచనలు, సలహాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కొలతల ప్రకారం నిర్మాణం చేపడితేనే బిల్లులు వస్తాయని, ఇష్టానుసారంగా ఇంటిని నిర్మించుకుంటే బిల్లులు రావన్నారు.
నిబంధనల ప్రకారమే నిర్మాణాలు చేసుకొని ప్రభుత్వ ప్రోత్సాహకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా మండలంలోని సంగెం గ్రామంలో ఇందిరమ్మ ఇంటి ప్రొసీడింగ్ పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి వెంకటేశ్, లబ్ధిదారులు పాల్గొన్నారు.