దోమ, డిసెంబర్ 24 : కులకచర్ల మండలంలో 36 గ్రామపంచాయతీలుండగా.. కేవలం 47 కేంద్రాలున్నాయి. దీంతో స్థానిక ఓటర్లు అవస్థ పడటాన్ని ఎంపీ రంజిత్‌రెడ్డి గమనించారు. ఎంపీ సూచన మేరకు ఎంపీ ఆఫీసు సిబ్బంది కలెక్టర్ నారాయణరెడ్డి దృష్టికి తీసుకెళ్లి.. ఈ అంశంపై దృష్టి కేంద్రీకరించాలను విజ్ఞప్తి చేశారు. అందుకు స్పందించిన కలెక్టర్ అవసరమైన చర్యలు చేపడుతామని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.
మండల పరిధిలోని లాల్‌సింగ్‌తండా, బండమీదితండా, బోజ్యానాయక్‌తండా, గోగ్యానాయక్తండా తదితర 12 గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలు లేవన్నారు. దీంతో పోలింగ్ సమయంలో వృద్ధులు, దివ్యాంగులు, వ్యాధిగ్రస్తులు ఓటు వేసేందుకు ఇక్కట్లు పడుతున్నారని తెలిపారు. స్థానికుల విజ్ఞప్తుల మేరకు కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు తక్షణమే చర్యలు చేపట్టేలా కార్యాచరణను సిద్ధం చేయాలని ఎంపీ కలెక్టర్‌ను కోరారు.