వికారాబాద్, డిసెంబర్ 6 : అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి అన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా కేంద్రం రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో ఆయన మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
నేటి యువత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను ఆదర్శంగా తీసుకొని, జీవితంలో రాణించాలన్నారు. మరోవైపు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, నాయకులు అంబేద్కర్ వర్ధంతిని నిర్వహించారు. వాడవాడలా ఆయన చిత్రపటాలను ఏర్పాటు చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు.