చేవెళ్లటౌన్, మే 16 : డిగ్రీ కళాశాల పనులను త్వరగా పూర్తి చేయాలని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం ఆయన చేవెళ్ల మం డల కేంద్రంలోని డిగ్రీ కళాశాల, మినీ స్టేడియంలో కొనసాగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ చేవెళ్ల నియోజకవర్గంలోని విద్యార్థులకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేస్తున్నదన్నారు. రానున్న విద్యాసంవత్సరం నుంచి అందులో తరగతులు ప్రారంభమయ్యేలా పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూ చించారు. అదేవిధంగా మినీ స్టేడియం పనులనూ పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో చేపట్టిన మినీస్టేడియం పనులు ఇంకా పెండింగ్‌లో ఉండటంతో క్రీడాకారులు ఎంతో ఇబ్బందికి గురవుతున్నారన్నారు. ఈ మైదానంలో వాకింగ్‌ట్రాక్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, ఓపెన్ జిమ్‌తోపాటు ఇతర వసతుల కల్పనకు తన సొంత నిధులు రూ. 40 లక్షలతో పనులను చేపడుతున్నట్లు ..త్వరలోనే క్రీడాకారులకు మైదానాన్ని అందుబాటులోకి తీసుకొస్తామన్నా రు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే నూతన డిగ్రీ కళాశాలలు, క్రీడామైదానాలు, ఆర్టీసీ డిపోలు వంటి ఎన్నో అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కృష్ణారెడ్డి, సాయి, దయాకర్, సత్తి, వెంకటేశ్ తదితరులుఉన్నారు.