షాద్‌నగర్ రూరల్, ఫిబ్రవరి28: రంగారెడ్డి జిల్లా మొగిలిగిద్ద గ్రామానికి చెందిన కక్కునూరి వెంకటేశం గుప్తా అనే భక్తుడు ఉదారత చాటుకున్నాడు. ఫరూఖ్‌నగర్ మండలంలోని అత్యంత పురాతన ఎలికట్ట అంబ భవానీమాత దేవాలయానికి 2.8కిలోల వెండితో వెండిధార పాత్రను అందజేశారు.
ఈ సందర్భంగా కుక్కునూరి వెంకటేశం గుప్తా మాట్లాడుతూ.. కోరిన కోర్కెలు తీర్చి కొంగు బంగారంగా నిలిచే శ్రీభవానీమాతకు సేవాచేసుకున్నే భాగ్యం కల్గడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.అదేవిధంగా ఆలయానికి వెండిధారపాత్రను అందజేయడం పట్ల దాతను ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేకంగా సన్మానించారు.