బొంరాస్పేట, జూన్ 9 : బొంరాస్పేట, దుద్యాల మండలాల్లో ఆది వారం ఓ మోస్తరు వర్షం కురిసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆకాశం మేఘావృతమై ఉంది. వర్షంతో రహదారులు బురదగా మారాయి. శనివారం కూడా మోస్తరు వర్షం కురవడంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేశారు. విత్తనాలు వేయడానికి వర్షాలు అనుకూ లంగా ఉన్నాయని రైతులు ఆనందంలో ఉన్నారు. మరో రెండు రోజు ల్లో వానాకాలం వ్యవసాయ పనులు జోరందుకునే అవకాశం ఉంది.
ధారూరు: ధారూరు మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో చిరు జల్లుల వర్షం కురిసింది. మండల పరిధిలోని అల్లిపూర్, ఏబ్బనూర్, కేరెళ్లి, బాచారం తోపాటు వివిధ గ్రామాల్లో వర్షం కురిసింది.
పెద్దేముల్: మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో ఓ మోస్తారు వర్షం కురిసింది. మంబాపూర్, కందనెల్లితండా, ఖానాపూర్, గాజీ పూర్, బుద్దారం, కందనెల్లి, రుక్మాపూర్, రేగొండి, మదనం తాపూర్, మన్సాన్పల్లి, జనగాం, మారేపల్లి, పెద్దేముల్, నాగులపల్లి, గోపాల్పూ ర్, బండమీదిపల్లి, అడికిచెర్ల, తట్టేపల్లి, పాషాపూర్, ఓమ్లా నాయక్ తండా, సిద్ధన్నమదుగు తాండ, ఆత్కూర్, ఎర్రగడ్డతండా, ఇం దూరు, హన్మాపూర్,జయరాంతాం, గిర్మాపూర్, గొట్లపల్లిల్లో వర్షం కురిసింది.