ఇబ్రహీంపట్నం, జనవరి 19 : పేదప్రజల కళ్లల్లో వెలుగులు నింపటం కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని, దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా గురువారం ఇబ్రహీంపట్నం బస్టాండులో ఏర్పాటు చేసిన కంటివెలుగు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ఆర్థిక ఇబ్బందులతో అనేకమంది కంటి సమస్యలతో బాధపడుతున్నవారి కోసం ప్రభుత్వమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఉచితంగా వైద్యసేవలందించటంతో పాటు అవసరమైన వారికి కంటి అద్దాలు, మందులు అందజేస్తున్నదని అన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ కమిటీ చైర్మన్ సత్తువెంకటరమణారెడ్డి, ఆర్డీవో వెంకటాచారి, మున్సిపల్ చైర్పర్సన్ స్రవంతి, వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, కమిషనర్ యూసుఫ్, కౌన్సిలర్లు భానుబాబు, మంగ, శ్రీలత, సుజాత, జగన్, సుధాకర్ పాల్గొన్నారు.
కడ్తాల్ : కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. మండల పరిధిలోని మైసిగండిలో కంటి వెలుగు కార్యక్రమాన్ని జడ్పీటీసీ దశరథ్‌నాయక్, సర్పంచ్ తులసీరాంనాయక్తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజారోగ్యానికి పెద్దపీటను వేస్తున్నారని తెలిపారు. కంటి పరీక్షలు చేయించుకున్న వారికి ఉచితంగా అద్దాలు, అవసరమైన వారికి ఆపరేషన్లు చేయనున్నట్లు చెప్పారు. అంతకుముందు వైద్య శిబిరంలో ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ కంటి పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, వెల్దండ జడ్పీటీసీ విజితారెడ్డి, తహసీల్దార్ మురళీకృష్ణ, ఎంపీడీవో రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
షాద్‌నగర్ : రాష్ట్రంలో అంధత్వ నివారణే ప్రధాన లక్ష్యంగా సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. గురువారం షాద్‌నగర్ నియోజకవర్గంలోని నందిగామ, చించోడు, కొందుర్గు, ఎలికట్ట గ్రామాల్లో రెండో విడుత కంటి వెలుగు శిబిరాలను ప్రారంభించి మాట్లాడారు. కంటి వెలుగు ద్వారా రోగులకు అవసరమయ్యే వైద్య పరీక్షలను ఉచితంగా చేయడంతో పాటు మందులను అందిస్తున్నదని, కంటి ఆపరేషన్ అవసరమయ్యే వారికి ప్రభుత్వం సూచించిన విధంగా ప్రముఖ దవాఖానల్లో వైద్య సేవలను అందిస్తారని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, ఎంపీపీ ఖాజా ఇద్రీస్ అహ్మద్, సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు జిల్లెల వెంకట్‌రెడ్డి, నందిగామ ఎంపీపీ ప్రియాంక, ఆర్డీవో రాజేశ్వరి, ఏడీఎం అండ్ హెచ్‌వో డాక్టర్. జయలక్ష్మి, కొందుర్గు వైస్ ఎంపీపీ రాజేశ్‌పటేల్, పీఏసీఎస్ చైర్మన్ దామోదర్‌రెడ్డి, జిల్లా మాస్ మీడియా అధికారి నరహరి, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
– ఎమ్మెల్యే అంజయ్యయాదవ్
షాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. గురువారం రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని చేవెళ్ల మండలం ఆలూర్, అంతారం, మొయినాబాద్ మండలం చిలుకూరు, మొయినాబాద్ గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు జరిగేలా అధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ దామోదర్, ఆర్డీవో వేణుమాధవ్‌రావు, ఎంపీపీలు మల్గారి విజయలక్ష్మి, గునుగుర్తి నక్షత్రం, జడ్పీటీసీలు మర్పల్లి మాలతీ, కాలె శ్రీకాంత్, ఎంపీడీవోలు రాజ్‌కుమార్, సంధ్య, తహసీల్దార్ శ్రీనివాస్, వైస్ ఎంపీపీలు మమత, శివప్రసాద్, సర్పంచ్‌లు కరీమహబూబ్, సులోచన, విజయలక్ష్మి, స్వరూప, మార్కెట్ కమిటీ చైర్మన్ రంగారెడ్డి, డాక్టర్ వాణి, సీహెచ్‌వో నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు.
– ఎమ్మెల్యే కాలె యాదయ్య