షాద్నగర్టౌన్, జనవరి 21: షాద్నగర్ పాత జాతీయ రహదారి విస్తరణ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలిపారు. పాత జాతీయ రహదారిని ఆదివారం సీడబ్ల్యూసీ సభ్యుడు వంశీచందర్రెడ్డితో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా పాత జాతీయ రహదారి పూర్తిగా గుంతలమయంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, త్వరలోనే రహదారి విస్తరణ పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ఇప్పటికే పాత జాతీయ రహదారి విస్తరణ పనుల గురించి సంబంధిత అధికారులతో మాట్లాడడం జరిగిందన్నారు. అనంతరం చౌడమ్మగుట్ట వీరాంజనేయస్వామి దేవాలయంలో పూజలు చేశారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.