షాద్నగర్టౌన్, అక్టోబర్ 28: షాద్నగర్ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యమని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ షాద్నగర్ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల రోడ్లకు గాను రూ. 105కోట్ల నిధులు, మున్సిపాలిటీకి అభివృద్ధికి రూ. 18.70కోట్ల నిధులు మంజూరు కావడం జరిగిందన్నారు. రూ.105కోట్ల నిధులతో 140కిలో మీటర్ల మేరా గ్రామీణ ప్రాంతాల రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు.
నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయడం లక్ష్యంగా ముందుకుసాగుతున్నామన్నారు. అదే విధంగా షాద్నగర్, కొత్తూరు మున్సిపాలిటీలను ఆదర్శంగా తీర్చిదిద్దనున్నామన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభకానున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ఖాన్, నాయకులు బస్వం, రఘు, రాజు, నర్సింహా పాల్గొన్నారు.