కొత్తూరు, జనవరి 7: కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఆదివారం కొత్తూరు మండంలోని ఎస్బీపల్లిలో రూ. 25 లక్షలతో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, రూ. 25 లక్షలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, రూ. 65 లక్షలతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు.
అనంతరం సర్పంచ్ అంబటి ప్రభాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కొత్తూరు మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి, ఎంపీపీ మధుసూదన్‌రెడ్డి, జడ్పీటీసీ శ్రీలత, మాజీ జడ్పీటీసీ శ్యాంసుందర్‌రెడ్డి, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు హరినాథ్‌రెడ్డి, ఎంపీటీవో శరత్చంద్రబాబు, ఏఈ హేమంత్, ఉప సర్పంచ్ దయానంద్‌గుప్తా, రవికుమార్ గుప్తా పాల్గొన్నారు.