కొత్తూరు, మే 25: అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేందకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలిపారు. కొత్తూరు మునిపాలిటీలో పలు వార్డులు, కొత్తూరు తండలో ఇందిరమ్మ ఇండ్ల పనులకు ఆదివారం భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు గృహ వసతి కల్పించేందకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మున్సిపాలిటీలోని ఆరో వార్డలో 33 కేవీ విద్యుత్ హైటెన్షన్ వైర్ల తొలిగించి ప్రజలను ప్రమాదాలను నుంచి కాపాడామని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలిపారు.
ఆరో వార్డులో హైటెన్షవైర్ల పల్లింపు ప్రక్రియ పూర్తిచేసినందుకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌కు కౌన్సిలర్ హేమాదేవేందర్ ఆధ్వర్యంలో ఆదివారం అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నో ఏండ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యను పరిష్కరించినందకు సంతోషంగా ఉందన్నారు. కార్యకరమంలో కాంగ్రెస్ నాయకులు జాండగూడెం సుదర్శన్‌గౌడ్, హరినాథ్‌రెడ్డి, సిద్దార్థరెడ్డి, అంబటి ప్రభాకర్, జగన్, జంగా నర్సింహా తదితరులు పాల్గొన్నారు.