షాద్‌నగర్‌టౌన్, మే 23 : నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేలా ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్‌నగర్ మున్సిపాలిటీలోని 7వ వార్డు సూర్యకాలనీతో పాటు ఫరూఖ్‌నగర్ మండలం ఎలికట్ట, మొగిలిగిద్ద, ఎల్లంపల్లి గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను శుక్రవారం ప్రారంభించారు. అదే విధంగా లబ్ధిదారులకు ఇండ్ల అర్హత పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన ప్రతి నిరుపేదల సొంతింటి కలను నేరవేర్చేందుకు ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందన్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్‌ఖాన్, మాజీ జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, మాజీ ఎంపీటీసీ శ్రీశైలం, నాయకులు చెన్నయ్య, తిరుపతిరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, ప్రవీణ్, మురళీమోహన్, శ్రీనునాయక్, టీ.జీ శ్రీనివాస్, రమేష్, దిలీప్, రవి, అశోక్, ఆర్ల యాదయ్య, రాజు, బాల్‌రాజు, నెహ్రూ, రామచంద్రయ్య పాల్గొన్నారు.