షాద్నగర్టౌన్, సెప్టెంబర్ 12: ప్రజా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆడబిడ్డల తల్లిదండ్రులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ఎంతో ఆసరాగా నిలుస్తుందన్నారు. అదే విధంగా ఆపదలో ఉన్నవారికి సీఎం సహాయనిధి ఎంతో ఉపయోగప డుతుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.