షాద్‌నగర్, డిసెంబర్ 11 : అభివృద్ధిలో భాగస్వా మ్యం కావడంతో పాటు ప్రజలకు అందుబాటు లో ఉంటూ.. సంక్షేమ పథకాలను ప్రజలకు అం దించడంలో ప్రధాన పాత్ర పోషించాలని ఎమ్మె ల్యే వీర్లపల్లి శంకర్ అధికారులకు సూచించారు. సోమవారం షాద్‌నగర్ పట్టణంలోని మండల పరిషత్ సమావేశ మందిరంలో పంచాయతీ రా జ్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మౌలిక వ సతుల కల్పనలో అధికారులు బాధ్యతాయుతం గా మెలగాలన్నారు.
అభివృద్ధి పనుల విషయం లో ఎక్కడ కూడా రాజీపడొద్దని, ఏమైనా సమస్యలు ఉంటే తక్షణమే తమ దృష్టికి తేవాలని సూచించా రు. అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని ముందుకు సాగాలని, నిధుల విడుదల, ఆలస్యం తదితర విషయాలపై ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని చె ప్పారు. కార్యక్రమంలో భాగంగా కొందుర్గు, చౌదరిగూడ, కొ త్తూరు, కేశంపేట, ఫరూఖ్‌నగర్, నందిగామ మండలాల అధికారులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఖాజ ఇద్రీస్, జడ్పీటీసీ పి.వెంకట్రాంరెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.