ఎల్బీనగర్, మే 22 : ఎల్.బి.నగర్ నియోజకవర్గ పరిధిలో కురిసిన భారీ వర్షాల్లో ముంపుకు గురైన ప్రాంతల్లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పర్యటించి బాధితులను పరామర్శించారు. అన్ని శాఖల అధికారుల ఫోన్లో మాట్లాడి అప్రమత్తం చే సారు. వర్ష ప్రభావం ఎక్కడ ఎక్కువగా ఉందో తెలుసుకొని అక్కడ సిబ్బందిని నియమించి వర్షపు నీరు సాఫీగా పోయే విధంగా చూడాలని ఆదేశించారు. అలాగే అధికారులు కూడా క్షేత్రస్థాయిలో ముంపు ప్రాంతాల్లో పర్యటించాలని సూచించారు.
డ్రైనేజీలో పేరుకుపోయిన సిల్ట్‌ను తీయిస్తామని తెలిపారు. అలాగే డ్రైన్స్ లింకప్ పనులు కూడా చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుత వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు కూడా తమవంతు విధిగా జాగ్రత్తలు పాటించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ భవాని, కుమార్, రమేష్ ముదిరాజ్ ,డివిజన్ అధ్యక్షులు శ్రీశైలం యాదవ్, కాలనీవాసులు పాల్గొన్నారు.