షాద్‌నగర్‌టౌన్, జూన్ 28: పేద ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. నియోజకవర్గంలోని పలువురు ఆనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేట్ దవాఖానలో చికిత్స చేయించుకున్న అనంతరం సీఎం సహాయనిధి దరఖాస్తు చేసుకోవడంతో మంజూరైన చెక్కులను షాద్‌నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం సహాయనిధి ఆపదలో ఉన్నవారి ఆర్థికంగా ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
సీఎం సహాయనిధి ద్వారా నిరుపేద ప్రజలు కార్పొరేట్‌స్థాయిలో వైద్యం పొందుతున్నారన్నారు. పేద ప్రజలకు సీఎం సహాయనిధి వరంగా మారిందని, అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం నియోజకవర్గంలోని 24 మంది లబ్ధిదారులకు రూ.12.28 లక్షల సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీకాంత్‌రెడ్డి, బాల్‌రాజు, కృష్ణ, సీతారామ్, అశోక్, శ్రీను పాల్గొన్నారు.