మొయినాబాద్, ఫిబ్రవరి19 : రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించి సమిష్టి కృషితో పని చేయాలని ఎమ్మెల్యే పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఇటీవలన జరిగిన మున్సిపల్ ఎన్నికల సందర్భంగా గురువారం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కోంపల్లి అనంతరెడ్డి, సీనియర్ నాయకులు కొత్త నర్సింహ్మరెడ్డి, కోట్ల నరోత్తంరెడ్డి, శ్రీహరియాదవ్, సీనియర్ నాయకులు, మాజీ ఉసర్పంచ్ గడ్డం అంజిరెడ్డి ఆధ్వర్యంలో 14వ వార్డు కౌన్సిలర్‌గా గెలుపొందిన కర్రోళ్ల శ్రీధర్, కంటెస్టెడ్ కౌన్సిలర్ నిర్డుల అనీతామహేందర్రెడ్డి, సురంగల్ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సబితారెడ్డిని కలిసి పుష్ప గుచ్ఛం అందించారు. గెలిచిన వారికి ఆమె అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అందరిని కలుపుకుని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. భవిషత్తులో బీఆర్ఎస్ అధికారంలోనికి రావడం ఖాయమని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు మంచి ఓటింగ్ శాతం పెరిగిందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడ బీఆర్ఎస్కు అనుకూల ఫలితాలు వస్తాయని అన్నారు.