పరిగి టౌన్, డిసెంబర్ 9 : ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్‌పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో శనివారం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని స్థానిక ఎమ్మెల్యే టి.రాంమోహన్‌రెడ్డి సతీమణి ఉమారామ్మోహన్‌రెడ్డి పరిగి బస్టాండులో ప్రారంభించారు.
మహిళలు ఉచితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించవచ్చని ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్‌పార్టీ వెనుకడుగువేసే ప్రసక్తేలేదన్నారు. మిగిలిన పథకాలను సైతం అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు లాల్‌కృష్ణప్రసాద్, శ్రీను, ఆర్. శ్రీను, పరశురాంరెడ్డి, ఎర్రగడ్డపల్లి కృష్ణ, ఆంజనేయులు పాల్గొన్నారు.