కొడంగల్, అక్టోబర్ 20 : అభివృద్ధి, సంక్షేమానికి బంగారు బాటలు వేసిన బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు పూర్తి మద్దతు తెలుపుతున్నారని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నియోకవర్గంలోని కొత్తపల్లి మండల పరిధిలోని పెద్దపూర్, గోర్లోనిబావి, దుప్పటిగట్టు, కిషన్‌నగర్ తదితర గ్రామాల్లో ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి పాటుపడుతున్న బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, కాబట్టే బీఆర్ఎస్ కు ఎదురులేదు..సీఎం కేసీఆర్‌కు తిరుగులేదన్నారు.కాంగ్రెస్ నాయకులను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చీకటి రోజులు తప్పవన్నారు. కర్ణాటక లో ప్రజలు కాంగ్రెస్‌ను ఎందుకు గెలిపించుకున్నామని బాధపడుతున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ డైరెక్టర్ సలీం, పీఏసీఎస్ చైర్మన్ జగదీశ్వర్, బీఆర్ఎస్ పార్టీ మండల అద్యక్షుడు వెంకటయ్య, మాజీ జడ్పీటీసీ బాల్‌సింగ్‌తో పాటు బీఆర్ఎస్ నాయకులు మధుసూదన్‌రెడ్డి, వీరారెడ్డి, రెడ్డి బసిరెడ్డి, మహిపాల్‌గౌడ్, సుల్తాన్ పాల్గొన్నారు. కాగా బుధవారం హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే నివాసంలో కోస్గి మండలం లోని సర్జఖాన్‌పేట్ గ్రామానికి చెందిన వంద మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఎంపీటీసీ నర్సింహులు ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. అలాగే మద్దూర్ మండలంలోని దుప్పటిగట్, గోర్లోనిబావి, కిషన్‌నగర్ గ్రామానికి చెందిన మరి కొందరు ఎమ్మెల్యే సమ క్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్‌తో పాటు రేవంత్‌రెడ్డిపై నియోజకవర్గ ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రలోభానికి గురి చేసి గురువారం కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారని మద్దూర్ మండలం లింగాల్చేడ్ గ్రామ సర్పంచ్ శశిపాల్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.వారి మాయ నుంచి తేరుకొని ఎమ్మెల్యే సమక్షంలో మళ్లీ సొంత గూటికి చేరుకున్నట్లు పేర్కొన్నారు.
మండలంలోని కస్తూర్పల్లి గ్రామంలో గురువారం కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ కార్య కర్తలు శుక్రవారం ఎమ్మెల్యే తనయుడి హితీష్రెడ్డి సమక్షంలో మళ్లీ గులాబీ గూటికి చేరుకున్నారు. కాంగ్రెస్ నాయకులు మాయమాటలు నమ్మి ఇంటి పార్టీని వీడి చాలా తప్పు చేసినట్లు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి చేసే సొంత ఇంటి పార్టీ బీఆర్ఎస్కు అండగా ఉంటామని, పట్నం నరేందర్‌రెడ్డి గెలుపునకు అహర్నిషలు కృషి చేస్తామని తెలిపారు. సొంత గూటికి చేరుతున్న బీఆర్ఎస్ కార్యకర్తలకు హితీష్రెడ్డి గులాబీ కండువాతో ఆహ్వానిస్తూ.. ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తామని భరోసా కల్పించారు.
బొంరాస్‌పేట: మండల కేంద్రంలో శుక్రవారం బీఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డికి మద్ధతుగా ఇంటింటికి తిరుగుతూ ప్రభు త్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి నాయకులు ప్రజలకు వివరించారు. వైస్ ఎంపీపీ శ్రావణ్‌గౌడ్, బీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు మహేందర్, మైనార్టీ నాయకులు అబ్దుల్ వాహబ్ తదితరులు పాల్గొన్నారు.