తాండూరు, సెప్టెంబర్ 11: ఐదు రోజులు ఘనమైన పూజలందుకున్న గణప య్యకు బుధవారం భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. రంగు రంగుల కాగి తాలు, పూలు, విద్యుద్దీపాలతో అలంకరించిన వాహనాల్లో వినాయక విగ్రహా లను ఉంచి కన్నుల పండువగా శోభయాత్ర నిర్వహించారు. దారి పొడవునా భజనలు, బ్యాండు చప్పుళ్లు, నృత్యాల హోరుతో వైభవంగా సాగిన వినాయక నిమజ్జనంలో అడుగడుగునా గణపయ్యకు భక్తులు నీరాజనం పలికారు. జై గణపతి…జై జై గణపతి.., గణపతి బొప్ప మోరియా ఆదాలడ్డూ కాలియా అం టూ భక్తులు, యువతీయువకుల నినాదాలు మిన్నంటగా తీన్మార్ డ్యాన్సు లు, ప్రత్యేక డోల్, బ్యాండ్, డప్పుల చప్పుడ్లతో పాటు అతివల కోలాటం, చిన్నారుల కేరింతల నడుమ విఘ్నేశుడిని వాగులు, చెరువులు, బావుల్లో నిమజ్జనం చేసి ‘పోయిరా గణపయ్యా పోయిరా’ అంటూ గంగమ్మ ఒడికి చేర్చారు.
హిందూ ఉత్సవ కేంద్ర సమితి తాండూరు శాఖ ఆధ్వర్యంలో సామూహిక వినా యక నిమజ్జన మహోత్సవ కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. బుధ వారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన సామూహిక వినాయక నిమజ్జ నోత్సవ కార్యక్రమం గురువారం తెల్లవారు జామువరకు కొనసాగింది. పట్టణం లోని కాలనీల్లో ఏర్పాటు చేసిన వినాయక ఊరేగింపు సంబరాలు అంబరా న్నంటాయి. వినాయక మండపాల నిర్వాహకులు పెద్ద ఎత్తున సంస్కాృతిక కార్యక్రమాలు, కోలాటాలు, భక్త జన మండలి సభ్యులతో భజనలు, బోనాలు, యువకుల కేరింతల మధ్య వినాయక నిమజ్జనం శోభాయామానంగా కొన సాగింది.
సామూహిక నిమజ్జన ఊరేగింపు కార్యక్రమాన్ని తిలకించేందుకు తాండూరు పట్టణంతో పాటు డివిజన్ పరిధిలోని తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్, కొడంగల్, బొంరాస్‌పేట్, దౌల్తాబాద్‌తో పాటు జిల్లాలోని పలు మండలాల ప్రజలు భారీగా తరలి రావడంతో రోడ్లు జనసం ద్రంగా మారాయి. పట్టణంలోని గంజ్ కూడలి (మర్రి చెట్టు) వినాయకుల సామూహిక ఊరేగింపు ప్రారంభమై గాంధీచౌక్, భద్రేశ్వర చౌక్, మార్వాడీ బజార్, రైల్వే స్టేషన్, శాంతిమహాల్ చౌరస్తా, వినాయక చౌక్, ఇంద్రాచౌక్, అంబేద్కర్ చౌక్ల మీదుగా యాలాల మండలం కోకట్ (నిమజ్జన స్థలం) వరకు భారీ ఎత్తున వినాయక విగ్రహాల ఊరేగింపు కొనసాగింది.
నిమజ్జనం సంద ర్భంగా భక్తులు, యువకులు, చిన్నారులు, మహిళలు గణపతి బప్పా మోరియా అంటు గులాల్ (రంగులు) చల్లుకుని ఒకరికొకరు నిమజ్జనోత్సవ ఉత్సాహాన్ని ప్రదర్శించి గణపయ్యకు ఘనంగా వీడ్కోలు పలికారు. నిమజ్జనోత్సవ కార్య క్రమంలో ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్, హిందూ ఉత్సవ కేంద్ర సమితి అధ్యక్షురాలు స్వప్న, కార్యదర్శి పట్లోళ్ల నర్సిహంలుతో పాటు రాజకీయ పార్టీల నేతలు, పట్టణ పురప్రముఖులు భద్రేశ్వర చౌక్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై నుంచి పూలు, రంగులు చల్లుతూ వినాయకులకు ఘనస్వాగం పలుకుతూ వీడ్కోలు చెప్పారు.
నిమజ్జన మహోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసు కోకుండా, ప్రశాంతమైన వాతావరణంలో వినాయకుల నిమజ్జనం జరిగేందుకు జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి, డీఎస్పీ బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో 350 మంది పోలీస్ సిబ్బంది విధులు నిర్వహించారు. భక్తులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బం దులు కలుగకుండా మున్సిపల్, రెవెన్యూ, వైద్యారోగ్యశాఖ, అగ్నిమాపక అధికారులు, సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
కులకచర్ల: కులకచర్ల మండల పరిధిలోని కాలోని తండాలో వినాయక నిమ జ్జనాన్ని ఘనంగా నిర్వహించారు. వినాయక నిమజ్జనం సందర్భంగా బుధవా రం తండాలో లడ్డూకు వేలవ పాట నిర్వహించారు. తండాకు చెందిన పరిగి నియోజకవర్గం సేవాలాల్ సేనా అధ్యక్షుడు భాస్కర్‌నాయక్ రూ. 26,600లకు లడ్డూను వేలంలో చేజిక్కించుకున్నాడు. వినాయకుడి లడ్డూను వేలంలో తీసుకో వడం చాలా ఆనందంగా ఉండదని భాస్కర్‌నాయక్ తెలిపారు.
వికారాబాద్: వికారాబాద్ నియోజకవర్గంలోని వికారాబాద్, మోమిన్‌పేట, కోట్‌పల్లి, బంట్వారం, ధారూరు, నవాబుపేట, మర్పల్లి మండలాల్లోని ఆయా గ్రామాల్లో భక్తులు వినాయకులను నిమజ్జనం చేశారు. మండపాల నిర్వా హకులు, గ్రామ పెద్దలు, యువత, చిన్నారులు గణపయ్యలకు ప్రత్యేక పూజలు చేశారు. చివరి రోజున లడ్డూ వేలం నిర్వహించి అధికంగా పాట పాడిన వారు దక్కించుకున్నారు. వినాయక మండపాల వద్ద భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తి పాటలతో స్వామివారిని గ్రామంలో ఊరేగించడంతో గ్రామ స్తులు పూజలు చేశారు. అనంతరం సమీపంలోని శివారెడ్డిపేట, ఎబ్బనూ రు,సర్పన్‌పల్లి, సోమారం తదితర చెరువులు,కుంటల్లో నిమజ్జనం చేశారు.
పాత తాండూరు గడిలో ఏర్పాటు చేసిన భారీ వినాయక విగ్రహం నిమ జ్జనం తిలకించేందుకు వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. హిందూ, ముస్లీంలు కలిసి గణపయ్య నిమజ్జనంను ఘనంగా నిర్వహించి మత సామరస్యాన్ని చాటారు. గడి ముందు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ముస్లీంలు నిలబడి వినాయకుడిపై పువ్వులు చల్లుతూ ఘన స్వాగతం పలుకుతూ వీడ్కోలు చెప్పారు. పోలీస్ అధికారులు అక్కడే ఉండి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో నిమజ్జనానికి సహకరించిన హిందూ, ముస్లిం ప్రజలకు జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి, తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, సీఐ సంతోశ్‌కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.