తుర్కయాంజాల్, నవంబర్ 21 : కాంగ్రెస్‌కు ఓటేస్తే ఉచిత కరెంట్ ఇస్తామంటున్నారని, ఉచిత కరెంట్ కాదు కదా ఉన్న కరెంట్ పోయి ప్రజలకు చీకటి రోజులు తప్పవని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని ఇంజాపూర్, మునగనూర్, తొర్రూర్, బ్రాహ్మణపల్లి, రాగన్నగూడ, మన్నెగూడ, తుర్కయాంజాల్, కమ్మగూడలో మంగళవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో రూ.2931 కోట్లతో అభివృద్ధి పనులను చేపట్టినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మాయ మటలను చెప్పి మోసం చేయాలని చూస్తున్నదని వివరించారు. ప్రజలు సీఎం కేసీఆర్‌ను విశ్వసిస్తున్నారని అన్నారు. ప్రజలంతా కారు గుర్తుకు ఓటువేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ సత్తు వెంకట రమణారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేశ్, డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, కౌన్సిలర్లు శ్రీలత, స్వాతి, సంగీత, మల్లేశ్, జ్యోతి, కీర్తన, బీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు అమరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
సంక్షేమ పథకాలే బీఆర్ఎస్కు కొండంత అండ
యాచారం : సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలే బీఆర్ఎస్కు కొండంత అండ అని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మండలంలోని తమ్మలోనిగూడ, చింతపట్ల, మొండిగౌరెల్లి గ్రామాలలో సోమవారం రాత్రి ఆయన రోడ్‌షో నిర్వహించారు. గ్రామాల్లో బీఆర్ఎస్ ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అనంతరం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వ పథకాలే బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపిస్తాయన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎన్ని ఎత్తుగడలకు పాల్పడినా పట్నం గడ్డపై గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసేది సీఎం కేసీఆరే అని అన్నారు. ఎన్నికల ముందొచ్చి మాయమాటలు చెప్పే కాంగ్రెస్ నాయకుల మాయ మాటలను నమ్మొద్దన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ జంగమ్మ, పీఏసీఎస్ చైర్మన్ రాజేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమేశ్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి పాచ్ఛ భాష, సర్పంచ్‌లు సంతోష, కృష్ణ, నాయకులు చిన్నోళ్ల యాదయ్య, కాలె మల్లేశ్ పాల్గొన్నారు.
కారు గుర్తుకు ఓటేయండి
పెద్దఅంబర్‌పేట : కారు గుర్తుకు ఓటేసి మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని మరోసారి గెలిపించాలని బీఆర్ఎస్ నాయకులు దండెం రాంరెడ్డి, కంచర్ల సత్యనారాయణరెడ్డి కోరారు. మంగళవారం స్థానిక నాయకులతో కలిసి పెద్దఅంబర్‌పేటలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కరెంటు కష్టాలు తీసుకొచ్చే కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మొద్దని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ దండెం కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షురాలు చెరుకూరి రేణుక, నాయకులు బాలకృష్ణగౌడ్, జగన్, పిల్లి నగేశ్, ఎండీ సత్తార్, అచ్యుత్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.
ముమ్మరంగా బీఆర్ఎస్ ప్రచారం
ఇబ్రహీంపట్నంరూరల్ : మంచిరెడ్డి కిషన్‌రెడ్డి గెలుపే లక్ష్యంగా ఇబ్రహీంపట్నం మండలంలోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు జోరుగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎలిమినేడు గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు.
జోరుగా గులాబీ ప్రచారం
మంచాల : మంచాల మండలం ఆరుట్ల, లోయపల్లి, మంచాల, జాపాల, అస్మత్పూర్ తదితర గ్రామాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో చిందం రఘుపతి, సేవ్యానాయక్, హరిప్రసాద్, రాంరెడ్డి, చంద్రకాంత్, సతీశ్, మల్లప్ప, వట్టి జంగయ్య, వీరేశ్, మంచాల రవి పాల్గొన్నారు.