వడ్ల పోరు రోజురోజుకూ ఉధృతమవుతున్నది. యాసంగి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం జాతీయ రహదారులను టీఆర్ఎస్ శ్రేణులు దిగ్బంధించాయి. పెద్ద అంబర్పేట్ వద్ద విజయవాడ జాతీయ రహదారిపై జరిగిన రాస్తారోకోలో రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎల్బీనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిలు పాల్గొన్నారు. బీజాపూర్ జాతీయ రహదారి చేవెళ్ల వద్ద జరిగిన రహదారి దిగ్బంధంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య, భూత్పూర్ వద్ద జరిగిన రాస్తారోకోలో షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన నినాదాలతో రహదారులు దద్దరిల్లాయి. వరి ధాన్యం కొనుగోలు చేసే వరకూ ఉద్యమిస్తామని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తే, కేంద్ర ప్రభుత్వం రైతుల నోట్లో మట్టి కొట్టేలా నిర్ణయాలు తీసుకుంటున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యాన్ని కొనకపోగా తెలంగాణ ప్రజలను కించపర్చేలా మాట్లాడడం సరికాదని హెచ్చరించారు. తెలంగాణ రైతులకు అన్యాయం జరుగుతున్నా స్థానిక బీజేపీ నాయకులు నోరుమెదుపకుండా ఉట్టి ప్రగల్భాలు పలుకుతున్నారని మండిపడ్డారు.
– రంగారెడ్డి, ఏప్రిల్ 6, (నమస్తే తెలంగాణ)
రైతులు పండించిన వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారులను దిగ్బంధించారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు బుధవారం జిల్లా మీదుగా వెళ్లే జాతీయ రహదారులపై టీఆర్ఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో రాస్తారోకో కార్యక్రమాన్ని నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితోపాటు ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, అంజయ్యయాదవ్, జైపాల్‌యాదవ్, సుధీర్‌రెడ్డి పాల్గొన్నారు. పెద్ద అంబర్పేట్ వద్ద విజయవాడ జాతీయ రహదారిపై టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎల్బీనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి నిరసన తెలిపారు. అదేవిధంగా బీజాపూర్ జాతీయ రహదారి వెళ్లే చేవెళ్ల వద్ద ఎమ్మెల్యే కాలె యాదయ్య, భూత్పూర్ వద్ద షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌లు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంజాబ్ మాదిరిగానే తెలంగాణ రైతులు పండించిన వరిధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం భారతదేశంలోని అన్ని రాష్ర్టాలను సమానంగా చూడాలన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేయడం మంచి పద్ధతి కాదని చెప్పారు. పంజాబ్, హర్యానాలకు ఒక న్యాయం.. తెలంగాణకు మరో న్యాయమా…? అని ప్రశ్నించారు. అక్కడ రైతుల వద్ద వడ్లు కొన్నట్లుగానే తెలంగాణ రైతులు పండించిన వడ్లు కూడా కేంద్రమే కొనుగోలు చేసే వరకూ ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
పెద్దఅంబర్‌పేట, ఏప్రిల్ 6 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని పెద్దఅంబర్‌పేట వద్ద విజయవాడ జాతీయ రహదారిపై బుధవారం ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డిలతో కలిసి పెద్దఎత్తున టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల చూపిస్తున్న వివక్షను ఎండగట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి రైతులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో రైతులు పండించిన యాసంగి వరి ధాన్యాన్ని కేంద్రమే కొని తీరాలని డిమాండ్ చేశారు. వడ్ల కొనుగొలుపై నిర్ధిష్ట విధానం ఉండాలని, తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం పక్షపాత వైఖరిని వీడాలన్నారు. తెలంగాణలో పండే వరి ధాన్యం కొనుగొలు చేయమని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం రాష్ట్ర రైతాంగాన్ని ఇబ్బందులకు గురిచేయడమేనన్నారు. అంతకుముందు పార్టీ శ్రేణులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బి.దయానంద్‌గుప్తా, రాష్ట్ర నాయకులు క్యామ మల్లేశ్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వి.లక్ష్మారెడ్డి, పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు సి.కృష్ణారెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు పి.అర్చన, హరశంకర్, రోహిణిరెడ్డి, పరుశురాం, టీఆర్ఎస్ మండల నాయకులు, ఎల్బీనగర్ నియోజకవర్గంలోని పలువురు మాజీ కార్పొరేటర్లు, పార్టీ మండల అధ్యక్షుడు కె.కిషన్‌గౌడ్, ఎం.సర్పంచ్ కిరణ్‌కుమార్, డి.విజయభాస్కర్‌రెడ్డి, రావుల గోపాల్, ఎ.వెంకటేశ్వరరెడ్డి, జె.రాము, శశి, ఎం.మహేందర్‌రెడ్డి, మల్లికార్జున్, ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్ నియోజకవర్గాల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
షాద్‌నగర్, ఏప్రిల్6 : కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రైతులు పండించిన వరి ధాన్యాన్ని ఎందుకు కొనుగోలుచేయరో రైతులకు వివరించాలని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ జాతీయ రహదారిపై టీఆర్ఎస్ నాయకులు, రైతులు నిర్వహించిన రాస్తారోకోలో పాల్గొని మాట్లాడారు. పంజాబ్ రాష్ట్రంలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నదని, తెలంగాణలో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా రైతులకు అన్యాయం చేస్తున్నదని చెప్పారు. ఆయా ప్రాంతాలకు అనుగుణంగా ధాన్యం నాణ్యత ప్రమాణాలు ఉంటాయనే విషయాన్ని కేంద్రం గ్రహించకపోవడమే కాకుండ తెలంగాణ రైతులను కించపర్చేలా వ్యవహరిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. వడ్లను కొనేవరకూ ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. తెలంగాణ రైతులకు అన్యాయం జరుగుతున్నదని తెలిసినా స్థానిక బీజేపీ నాయకులు నోరుమెదుపకుండా ఉట్టి ప్రగల్భాలు పలుకుతున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నటరాజన్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, ఎంపీపీ ఖాజ ఇద్రీస్, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
ఆమనగల్లు, ఏప్రిల్ 6 : యాసంగి వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌లో భాగంగా టీఆర్ఎస్ పార్టీ ఆదేశానుసారం బుధవారం ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ వద్ద బెంగళూరు జాతీయ రహదారి దిగ్బంద కార్యక్రమంలో పాల్గొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తక్షణమే రైతుల నుంచి యాసంగి పంటను కొనుగోలు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలులో దాటవేత ధోరణికి పాల్పడితే ఉద్యమం మరింతతీవ్ర రూపం దాల్చుతుందని ఆయన హెచ్చరించారు. ఈ నిరసనలకు ఆమనగల్లు బ్లాక్ మండలాల నుంచి టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, వైస్ చైర్మన్ తోటగిరియాదవ్ పాల్గొన్నారు.
షాబాద్, ఏప్రిల్ 6 : పంజాబ్ మాదిరిగానే తెలంగాణ రైతులు పండించిన వరిధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. బుధవారం చేవెళ్ల నియోజకవర్గ కేంద్రంలోని హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై టీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం భారతదేశంలోని అన్ని రాష్ర్టాలను సమానంగా చూడాలన్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో వేల కోట్లతో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి వ్యవసాయానికి సాగునీరందిస్తున్నారన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేయడం మంచి పద్ధతి కాదని చెప్పారు. పంజాబ్, హర్యానాలకు ఒక న్యాయం.. తెలంగాణకు మరో న్యాయమా..? అని ప్రశ్నించారు. అక్కడ రైతుల వద్ద వడ్లు కొన్నట్లుగానే తెలంగాణ రైతులు పండించిన వడ్లు కూడా కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం వడ్లు కొనేదాకా పోరాటాలు ఆపేది లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల ఎంపీపీలు మల్గారి విజయలక్ష్మి, గోవర్దన్‌రెడ్డి, గునుగుర్తి నక్షత్రం, జడ్పీటీసీలు మర్పల్లి మాలతి, కాలె శ్రీకాంత్, గోవిందమ్మ, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, టీఆర్ఎస్ ఆయా మండలాల అధ్యక్షులు పి.ప్రభాకర్, గోపాల్, వాసుదేవ్‌కన్నా, మహేందర్‌రెడ్డి, పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు స్వప్న, కార్యదర్శి అనిత, పార్టీ నాయకులు రమణారెడ్డి, కృష్ణారెడ్డి, వెంకట్‌రెడ్డి, మాణిక్యరెడ్డి, జయవంత్, నాగార్జునరెడ్డి, బి.రాంరెడ్డి, ప్రవీణ్‌కుమార్, చందు పాల్గొన్నారు.