మంచాల, నవంబర్ 22 : కాంగ్రెస్‌కు ఓటు వేస్తే మిగిలేది కన్నీళ్లేనని ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మండలంలో పరిధిలోని దాద్‌పల్లి, చీదేడు, రంగాపూర్, ఎల్లమ్మతండా, బోడకొండ తదితర గ్రామాల్లో బుధవారం ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలం అభివృద్ధే లక్ష్యంగా నిరంతరం పని చేశానని, తనను నాలుగోవసారి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలే శ్రీరామరక్ష అని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు దండెం రాంరెడ్డి, వెంకటేశ్ గౌడ్, ఏర్పుల చంద్రయ్య, బుస్సు పుల్లారెడ్డి, బొద్రమోని యాదయ్య, చీరాల రమేశ్, బహదూర్, ప్రకాశ్‌రెడ్డి, దిలీప్‌రెడ్డి, బద్రీనాథ్గుప్తా పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి మద్దతుగా మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో బీఆర్ఎస్ నాయకులు ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తున్నారు. మార్కెట్‌కమిటీ డైరెక్టర్ కిరణప్ప ఆధ్వర్యంలో బుధవారం విస్తృత ప్రచారం నిర్వహించారు. మంచిరెడ్డిని గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు.
పెద్దఅంబర్‌పేట : బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని కౌన్సిలర్ తొండాపు రోహిణీ బ్రహ్మానందారెడ్డి అన్నారు. మున్సిపాలిటీ 14వ వార్డు పరిధి ఇందుపల్లవి అపార్టుమెంట్లో స్థానిక నాయకులతో కలిసి ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మరోసారి మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరుతున్నాయన్నారు. పెద్దఅంబర్‌పేటలో బీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీ మాజీ అధ్యక్షుడు కంచర్ల సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో, ఆర్కేనగర్లో బీఆర్ఎస్ నేత దండెం రాంరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. ఒకటో వార్డు కుంట్లూరు పరిధిలోని రాజీవ్‌గృహకల్ప ప్రాంతంలో బీఆర్ఎస్ నాయకులు జహంగీర్, రసూల్ తదితరుల ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు.
ఇబ్రహీంపట్నంరూరల్ : బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి గెలుపుకోసం ఇబ్రహీంపట్నంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. వైస్ ఎంపీపీ ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎలిమినేడు గ్రామంలో ప్రచారం నిర్వహించారు. వ్యవసాయ పొలాల్లో పనులు చేస్తున్న కూలీల వద్దకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే అబివృద్ధి మరింత మెరుగుపడుతుందని చెప్పారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న మంచిరెడ్డికి మద్దతుగా నిలువాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
యాచారం : మండలంలోని తక్కళ్లపల్లి గ్రామంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని మరోసారి గెలిపించాలని ఆయన కోడలు మౌనికరెడ్డి మంగళవారం రాత్రి జోరుగా ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ మహిళలకు బొట్టు పెట్టి ఓటును అభ్యర్థించారు. మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ తలారి మల్లేశ్, సర్పంచ్ సంతోష పాల్గొన్నారు.
అబ్దుల్లాపూర్‌మెట్టు : బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటు వేయాలని బీఆర్ఎస్ నాయకులు కోరారు. మండల కేంద్రంలోని దుకాణ సముదాయాల్లో తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలో అభివృద్ధ్ది జరుగలేదని ప్రతిపక్ష నేతలు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాయన్నారు. బాటసింగారంలో ఈవీఎం నమూనాతో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్వై నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి జీవన్‌కుమార్‌రెడ్డి,నాయకులు శ్రీనివాస్‌గౌడ్, వేణు, వెంకటస్వామి, సందీప్‌గౌడ్, సాయి, సూర్య, ప్రకాశ్, ఉపసర్పంచ్ కంది భాస్కర్‌రెడ్డి, వార్డు సభ్యులు వెంకటేశ్‌యాదవ్, ఎర్రవెల్లి ఉమాకాంత్చారి, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు కంది ధన్సాగర్రెడ్డి పాల్గొన్నారు.
ఆదిబట్ల : అభివృద్ధి కోసం నిరంతరం తపించే ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆదిబట్ల మున్సిపాలిటీ కోఆప్షన్ సభ్యుడు పల్లె గోపాల్‌గౌడ్ అన్నారు. ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో పల్లె శ్రీనివాస్‌గౌడ్, టి రాజు, కుమ్మరి ప్రభాకర్, కృష్ణ, గజ్జెల శ్రీకాంత్, రాము, వెంకటేశ్ పాల్గొన్నారు.