మంచాల, జూన్ 18 : సీఎం కేసీఆర్ కోట్లాది రూపాయలు వెచ్చించి మిషన్ భగీరథ ద్వారా ప్రతి గ్రామంలోని ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందించి ప్రజలకు అండగా నిలిచారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మంచాలలోని పంచాయతీ కార్యాలయం వద్ద మంచినీళ్ల పండుగను ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించి అనంతరం గ్రామంలోని ప్రతి ఇంటికెళ్లి నల్లాల ద్వారా వస్తున్న స్వచ్ఛమైన మిషన్‌భగీరథ నీటిని పరిశీలించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ… మంచాల మండలంలో 33 పంచాయతీలు ఉండగా అందులో ప్రతి పల్లెకూ మిషన్ భగీర థ నీటి సరఫరా జరుగుతుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ జగన్‌రెడ్డి, ఎంపీపీ నర్మద, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ వెం కటరమణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రయ్య, సహకార సంఘం చైర్మన్ పుల్లారెడ్డి, మిషన్ భగీరథ అధికారి స్రవంతి, ఎంపీడీవో శ్రీనివాస్, తహసీల్దార్ అనిత, పంచాయతీ కార్యదర్శి రాజ్‌కుమార్ బీఆర్ఎస్ నాయకులు చీరాల రమేశ్, బహదూర్, కిషన్‌రెడ్డి, రాజేశ్, శంకర్, రఘుపతి పాల్గొన్నారు.
యాచారంలో..
యాచారం : దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మండలంలోని ఆదివారం మంచినీళ్ల పండుగను ఘనంగా జరుపుకొన్నారు. గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించారు. మిషన్ భగీరథ ట్యాం కులు, నల్లాల వద్ద పూజలు చేశారు. నీటి వృథాను అరికడతామని అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు ప్రతిజ్ఞ చేశారు. మండలంలోని గడ్డమల్లయ్యగూడలో ఎంపీపీ సుకన్య, జడ్పీటీసీ జంగమ్మ, పీఏసీఎస్ చైర్మన్ రాజేందర్‌రెడ్డి, వైస్ ఎం పీపీ శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్ జంగయ్య, తహసీల్దార్ సుచరిత, ఎంపీడీఓ విజయలక్ష్మి, ఎంపీవో ఉమారాణి, ఆయా గ్రామాల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
గౌరెల్లిలో..
పెద్దఅంబర్‌పేట : దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని గౌరెల్లిలో మంచినీటి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ ఆధ్వర్యంలో గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో దాదాపు 4 కిలోమీటర్ల మేర వాటర్‌వర్క్స్ విభాగం చేపడుతున్న అర్బన్ మిషన్ భగీరథ పైపులైన్ పనులను సీజీఎం అమరేందర్‌రెడ్డి, జీఎం శ్రీధర్, బాటసింగారం రైతు సేవా సహకార సంఘం చైర్మన్ లెక్కల విఠల్‌రెడ్డి, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు అక్బర్ అలీఖాన్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి సహకారంతో గ్రామాన్ని అనివిధాలా అభివృద్ధి చేస్తున్నట్టు గౌరెల్లి సర్పంచ్ తుడుము మల్లేశ్ అన్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తున్నా మన్నారు. కార్యక్రమంలో వాటర్ వర్క్స్ డీజీఎం రవివర్మ, మేనేజర్ భగవాన్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
కడ్తాల్‌లో..
కడ్తాల్ : దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మండలంలో మంచినీళ్ల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ పథకంలో నిర్మించిన వాటర్ ట్యాంక్‌లను కొబ్బరి, మామిడాకు తోరణాలతో అందంగా ముస్తాబు చేశారు. గాన్గుమార్లతండా పంచాయతీలోని కాన్గుబావి తండా లో నిర్వహించిన కార్యక్రమంలో జడ్పీటీసీ మాట్లాడుతూ మి షన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని తెలిపారు. సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు దేశంలోనే ఆదర్శమన్నారు. పలు గ్రామాల్లో మంచి నీటి ట్యాంక్‌ల వద్ద నీటి వృథా చేయవద్దని అధికారులు మహిళలతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు లక్ష్మీనర్సింహారెడ్డి, హంశ్యా, సులోచన, తులసీరాంనాయక్, కృష్ణయ్యయాదవ్, భారతమ్మ, యా దయ్య, ఎంపీటీసీలు గోపాల్, లచ్చిరాంనాయక్, ఉప సర్పంచ్ రామకృష్ణ, గణేశ్, శారద, నరేశ్, వినోద్, పీఏసీఎస్ డైరెక్టర్ సేవ్యానాయక్, ఏఈలు శ్రావ్యా, వాగ్ధేవి, నాయకులు అశోక్, భీమన్, శ్రీను, లక్ష్మణ్, లక్పతి, టీకులాల్, సక్రు తదితరులు పాల్గొన్నారు.