కాంగ్రెస్‌పార్టీ నాయకుడికి సీఎంఆర్ఎఫ్ చెక్ అందజేసిన ఎమ్మెల్యే మంచిరెడ్డి
MLA Manchireddy | రాజకీయాలకతీతంగా అర్హులైన వారందరికి ముఖ్యమంత్రి సహాయనిధిని అందజేస్తున్నామని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు.
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 30 : రాజకీయాలకతీతంగా అర్హులైన వారందరికి ముఖ్యమంత్రి సహాయనిధిని అందజేస్తున్నామని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మంచాల మండలం కాంగ్రెస్‌పార్టీ సీనియర్ నాయకుడు ఎల్లారెడ్డికి ముఖ్యమంత్రి సహాయనిధి కింద ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.60వేల చెక్కును శుక్రవారం ఎమ్మెల్యే అందజేశారు.
అలాగే, కాంగ్రెస్‌పార్టీకి చెందిన మరో ఉపసర్పంచ్ స్వాతిరెడ్డికి రూ.56వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును కూడా ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..టీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయాలకు తావులేకుండా సంక్షేమ పథకాలను అర్హులకు అందించాలన్న లక్ష్యంతోనే పనిచేస్తుందని అన్నారు.
గత ప్రభుత్వంలో ఆయాపార్టీలకు సంబంధించిన వారికి ప్రభుత్వం లబ్ధి చేకూరేదని ఆయన అన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌కమిటీ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు బుగ్గ రాములు, అమరేందర్‌రెడ్డి, నిట్టు జగదీశ్వర్, మస్కు రమేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

