యాచారం, జనవరి 28 : నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఆదివారం మండ లంలోని గడ్డమల్లాయగూడ, మల్కీజ్‌గూడ, తమ్మలోనిగూడ, మాల్ తదితర గ్రామాల్లో పర్యటించి భూగర్భ డ్రైనేజీ, సీసీరోడ్లు, డ్వాక్రా భవనం, బీసీ కమ్యూనిటీహాల్ తదితర అభివృద్ధి పనులను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించి మాట్లాడారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు.
పెండింగ్‌లో ఉన్న పనులను దశల వారీగా పూర్తి చేస్తానని.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తుందని స్పష్టం చేశారు. ప్రజలు తమ సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చా రు. అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కొప్పు సుకన్య, జడ్పీటీసీ చిన్నోళ్ల జంగమ్మ, వైస్ ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్‌లు జంగయ్య, యాదమ్మ, సంతోష, కవిత, ఎంపీటీసీ లక్ష్మీపతిగౌడ్, వెంకటేశ్వర్లు, నర్సింహ, సురేందర్‌రెడ్డి, సుధాకర్, మహ్మద్‌గౌస్, శ్రీనివాస్, శేఖర్‌గౌడ్, రమేశ్ పాల్గొన్నారు.