కాంగ్రెస్‌కు ఓటేస్తే ఇరవై ఏండ్లు వెనక్కే
ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చిన బీఆర్ఎస్ కావాలో మూడు గంటల కరెంటు ఇస్తామంటున్న కాంగ్రెస్ కావాలో మీరే నిర్ణయించి ఓటు వేయండని పరిగి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు.
- పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి
దోమ, నవంబర్ 20 : ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చిన బీఆర్ఎస్ కావాలో మూడు గంటల కరెంటు ఇస్తామంటున్న కాంగ్రెస్ కావాలో మీరే నిర్ణయించి ఓటు వేయండని పరిగి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని గుండాల, కొత్తపల్లి, దాదాపూర్, మల్లేపల్లి, బట్లసందారం, దిర్సంపల్లి, కొండాయపల్లి, బడెంపల్లి, గంజిపల్లి, గొట్లచెల్కతండా, బ్రాహ్మణపల్లి, పెద్ద తండా తదితర గ్రామాల్లో సోమవారం ఆయన జడ్పీటీసీ నాగిరెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న బీఆర్ఎస్ను గెలిపించాలన్నారు.
ఎన్నికల తరువాత దాదాపూర్ గ్రామాన్ని కొత్త మండలంగా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.మాయ మాటలు చెప్పే కాంగ్రెస్‌కు ఓటు వేస్తే తెలంగాణ అభివృద్ధి మరో 20 యేండ్లు వెనక్కి పోతుందన్నారు. మహిళల అభ్యున్నతిని ఆలోచించిన సీఎం కేసీఆర్ ’సౌభాగ్యలక్ష్మి పథకం’ తో 18 ఏండ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు మూడు వేల రూపాయలు అందజేసే పథకాన్ని తీసుకువచ్చారని గుర్తు చేశారు. కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని మహేశ్‌రెడ్డి ప్రజ లను కోరారు.
ఈ సందర్భంగా బడెంపల్లి గ్రామానికి చెందిన మల్కయ్య 15 మంది అనుచరులతో కలిసి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరగా నేడు తిరిగిఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి సమక్షంలో సొంత గూటికి చేరారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మల్లేశం, రైతు బంధు సమితి కోఆర్డినేటర్ లక్ష్మయ్య ముదిరాజ్, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు రాజిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు గోపాల్‌గౌడ్, కోఆప్షన్ ఖాజా పాషా, యువ నాయకులు కృష్ణారెడ్డి, మచ్చెందర్రెడ్డి, కొండారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పార్టీ గ్రామ అధ్యక్షులు,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

