మొయినాబాద్, అక్టోబర్ 22 : అరవై ఏండ్ల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలకు..వారంటీ లేదని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. ఆదివారం మండల పరిధిలోని నక్కలపల్లి, ఎతుబార్పల్లి, తోలుకట్టా గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రజలు ఘన స్వాగతం పలికారు. మహిళలు హారతి పట్టి ఆదరించారు. ఇంటింటికీ తిరిగి ప్రతి ఓటరును కలిసి కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొమ్మిదిన్నర ఏండ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమి చేసిందో చెప్పడానికి బహిరంగ చర్చకు మేము సిద్ధమని సవాల్ విసిరారు. కాంగ్రెస్, బీజేపీ చెప్పే మాయ మాటలు నమ్మి ఓటు వేస్తే 60 ఏండ్ల పాటు పడిన గోస మళ్లీ పడుతామని గుర్తు చేశారు.
గతంలో ఎతుబార్పల్లి గ్రామం నక్కలపల్లికి అనుబంధ గ్రామంగా ఉండేదని, బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక గ్రామ పంచాయతీని ఏర్పాటు చేసిందని చెప్పారు. హైతాబాద్-నక్కలపల్లి గ్రామాల మధ్య ఉన్న ఈసీ వాగుపై వంతెన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్లు కేటాయించిందని చెప్పారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో వంతెన పనులు చేయడంతో జాప్యం జరిగిందని, ఎన్నికలు పూర్తి అయిన తరువాత ఏప్రిల్ మాసంలో పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. జంట జలాశయాలలు కలుషితం కాకుండా ఈసీ, మూసీ నదులపై ఎస్టీపీ ప్లాంట్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని, చేవెళ్ల ప్రాంతాన్ని మరో గచ్చిబౌలిగా అభివృద్ధి చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్ ప్లాన్‌ను రూపొందించిందని వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేవెళ్లను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఉన్నారని చెప్పారు.
హైతాబాద్‌లో ఏర్పాటు చేయబోతున్న ఓ టెక్స్టైల్స్ కంపెనీలో 35 వేల మంది మహిళలకు ఉపాధి కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కాలె శ్రీకాంత్, నక్కలపల్లి సర్పంచ్ స్వప్న, ఉపసర్పంచ్ ఎం రాజు, ఎతుబార్పల్లి సర్పంచ్ గుండాల నవనీత, తోలుకటా ్టసర్పంచ్ కె శ్రీనివాస్, ఉపసర్పంచ్ రవీందర్‌రెడ్డి, మండల కోఆప్షన్ సభ్యుడు ఎండీ బిలాల్, ఏఎంసీ వైస్ చైర్మన్ ఎంఏ రవూఫ్, మాజీ వైస్ చైర్మన్లు దారెడ్డి వెంకట్‌రెడ్డి, డప్పు రాజు, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు జయవంత్, సుధాకర్‌యాదవ్, ప్రధాన కార్యదర్శి నర్సింహగౌడ్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ జగన్మోహన్రెడ్డి, జిల్లా నాయకులు ఈగ రవీందర్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, రవియాదవ్ పాల్గొన్నారు.
కేశంపేట : షాద్‌నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్యయాదవ్ గెలుపే లక్ష్యంగా కలిసి పనిచేయాలని ఎంపీపీ రవీందర్‌యాదవ్ అన్నారు. మండలంలోని సంగెంలో ఆదివారం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. అంజయ్యయాదవ్ గెలుపునకు నాయకులు, కార్యకర్తలు సైనికుల్లాగా పనిచేయాలని ఎంపీపీ సూచించారు. అంజయ్యయాదవ్ షాద్‌నగర్ నియోజకవర్గాన్ని కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేశారని కొనియాడారు. నిరంతరం ప్రజలకు పనిచేసే నాయకుడు అంజన్న అని, ఆయన గెలుపునకు ప్రతి ఒక్కరూ శక్తివంచన లేకుండా కృషి చేయాలన్నారు. భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పని చేస్తామని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. కార్యక్రమంలో కొత్తపేట పీఏసీఎస్ చైర్మన్ జగదీశ్వర్‌గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మురళీధర్‌రెడ్డి, నాయకులు లక్ష్మీనారాయణగౌడ్, వెంకటేశ్‌గౌడ్, మధుసూదన్‌రెడ్డి, బాల్‌రాజ్, వేణుగోపాలాచారి, యాదగిరిగౌడ్, యాదగిరి, తిరుమలేశ్గౌడ్, బాలస్వామి, కుమ్మరి శ్రీను, కృష్ణయాదవ్, కుమార్ పాల్గొన్నారు.
నందిగామ : ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపే లక్ష్యంగా గులాబీ శ్రేణులు ముమ్మర ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. అంజయ్యయాదవ్ షాద్‌నగర్ నియోజకవర్గాన్ని వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారని, అంజయ్యయాదవ్‌ను మరోసారి గెలిపించాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.