రైతుల నోట్లో మట్టికొట్టింది కాంగ్రెస్సే
కాంగ్రెస్ నాయకులు రైతుబంధుని ఆపి రైతుల నోట్లో మట్టి కొట్టారని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. ఎన్నికల ప్రచారానికి మంగళవారం చివరిరోజు కావడంతో తలకొండపల్లి, కడ్తాల్, ఆమనగల్లు మండలాల్లో బీఆర్ఎస్ శ్రేణులు ప్రచారాన్ని హోరెత్తించాయి.
- బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్
- తలకొండపల్లి, కడ్తాల్ మండలాల్లో హోరెత్తిన గులాబీ శ్రేణుల ప్రచారం
కడ్తాల్/ఆమనగల్లు, నవంబర్ 28: కాంగ్రెస్ నాయకులు రైతుబంధుని ఆపి రైతుల నోట్లో మట్టి కొట్టారని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. ఎన్నికల ప్రచారానికి మంగళవారం చివరిరోజు కావడంతో తలకొండపల్లి, కడ్తాల్, ఆమనగల్లు మండలాల్లో బీఆర్ఎస్ శ్రేణులు ప్రచారాన్ని హోరెత్తించాయి. తలకొండపల్లి,గట్టిప్పలపల్లి, వెల్జాల్, కడ్తాల్ మండలంలోని మర్రిపల్లిలో బీఆర్ఎస్ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ పాల్గొని మాట్లాడారు. క
ల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధికే తన జీవితం అంకితమన్నారు. మరోసారి ఆశీర్వదించి గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో సబ్బండ వర్గాలు ఆనందంగా ఉన్నాయన్నారు. పేదలను ఆదుకోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అందించిందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మ్యానిఫెస్టోలో పేర్కొన్న హామీలను నెరవేరుస్తామని తెలిపారు.

పాలమూరు-రంగారెడ్డి పథకంతో ఆమనగల్లు, తలకొండపల్లి, మాడ్గుల్, కడ్తాల్ మండలాలకు సాగునీరందిస్తామన్నారు. కాంగ్రెస్ మాయమాటలు నమ్మితే కరెంట్ కష్టాలు తప్పవని పేర్కొన్నారు. ప్రజల ఆశీర్వాదంతో బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో హ్యాట్రిక్ విజ యం సాధించడం ఖాయమన్నారు. ఎన్నికలయ్యాక వెల్జాల్, గట్టిప్పలపల్లి, రఘుపతిపేట్ గ్రామాలను మండలాలుగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్‌కు ఓటేస్తే కష్టాలే..
కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కరెంట్ కష్టాలు తప్పవని, ప్రజలు ఆలోచించి ఓటేయాలని మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్ అన్నారు. తలకొండపల్లి మండలంలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొన్ని మాట్లాడారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను, బీజేపీ మాయమాటలను నమ్మి మోసపోవద్దని తెలిపారు. ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలను అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని తెలిపారు. జైపాల్యాదవ్ని ప్రజలు ఆదరించి గెలిపించాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో ఎంపీపీ నిర్మలాశ్రీశైలం, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు శంకర్, మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌యాదవ్, మాజీ జెడ్పీటీసీ నర్సింహ, సర్పంచులు లలిత, జయ మ్మ, చంద్రయ్య, లక్ష్మణ్‌నాయక్, ఎంపీటీసీలు రఘు, నాయకులు శ్రీశైలం, చంద్రశేఖర్‌రెడ్డి, దశరథ్‌నాయక్, వెంకటయ్య, శేఖర్‌యాదవ్, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Drishyam 3 | ‘దృశ్యం 3’ బాక్సాఫీస్ సునామీ.. 8 రోజుల్లోనే రూ. 400 కోట్లు!
High Blood Pressure | రక్తపోటు అదుపులోకి రావడం లేదా? అసలు కారణాలు ఇవే..
Ranabaali | ‘రణబాలి’కి టికెట్ ధరలే ప్లస్ పాయింట్.. ‘జైలర్ 2’తో పోటీలో విజయ్ దేవరకొండకు కలిసొచ్చే అంశమిదే!
Rohan Rane: మైనర్ అమ్మాయిల లైంగిక వేధింపులు.. ఫ్రాన్స్‌లో భారతీయుడికి 20 ఏళ్ల జైలుశిక్ష
Comrade Kalyan | శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’కు మంచి ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.4 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

